మన కుటుంబంలో ఒక మానసిక వికలాంగుడు ఉంటేనే అతడి మాటలు, చేష్టలు, ప్రవర్తన వల్ల ఎంతో ఇబ్బంది పడి, వీడికి ఎందుకు చావు రావట్లేదు రా దేవుడా అని కోరుకునే దుర్మార్గపు మనుషులు ఉన్న ఈ సమాజంలో మతిస్థిమితం కోల్పోయి నగ్నంగా, అర్థ నగ్నంగా, ఎండనకా, వాననకా, చలికి వణుకుతూ నిస్సహాయులుగా రోడ్ల పైన ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వారు మనం తిని పడేసిన వ్యర్థాలను తింటూ, మురికి నీరు తాగుతూ జీవనం గడుపుతున్న మతిస్థిమితం కోల్పోయిన అనాధలను తన కుటుంబసభ్యులుగా భావించి వారిని అక్కున చేర్చుకుని, వారి భాగోగులు చూసుకుంటుంది మాతృదేవోభవ అనాధ ఆశ్రమం.
ఆశ్రమంలో ఇప్పటి వరకు ఇలాంటి మానసిక వికలాంగులను 500 మందికి పైగా అనాధలను ఆశ్రయం కల్పించడం జరిగింది. అలాగే వారికి మానసిక వైద్యం అందించి, వారి వారి కుటుంబసభ్యులకు 370 మంది వరకు పంపించడం జరిగింది. ప్రస్తుతం మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో 130 మంది మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు.
గత 5 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి విజ్రుంబిస్తున్న సమయంలో చర్లపల్లి ప్రాంతంలో పెరిగిన గడ్డంతో మతిస్థిమితం కోల్పోయి అనాధగా రోడ్డు పక్కన పడుకుని ఉన్న వ్యక్తిని చూసి మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరి గారు అతడిని ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది. అతడి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా అతని పేరు విఠల్ అని మాత్రమే చెప్పాడు. అతని కుటుంబ వివరాలు, అడ్రస్ చెప్పలేదు.. అతనికి 5 సం. రాలుగా మానసిక వైద్యం పూర్తిగా అందించిన తరవాత వారం రోజుల క్రితం మరల అతని వివరాలు కనుక్కోగా అతని పేరు రమేష్ అని, వరంగల్ జిల్లా, ఏటూరు నాగారం మండలం, శివపురం అనే గ్రామం అని చెప్పడంతో వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించడం జరిగింది.
రమేష్ కుటుంబసభ్యులు ఈరోజు మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి వచ్చారు. 5 సం.రాల క్రితం తప్పిపోయి చనిపోయాడు అనుకున్న తన తమ్ముడిని ఆశ్రమంలో చూసి రమేష్ అక్కయ్య గారు కన్నీటి పర్యంతమయ్యారు. రమేష్ కూడా తన అక్కయ్య చూసి భావోద్వేగానికి గురైనాడు.రక్తం పంచుకుని పుట్టిన జన్మ బంధం కడ వరకు ఉంటుంది అని నిదర్శనంగా నిలిచారు ఈ అక్క-తమ్ముడు.
చనిపోయాడు అనుకున్న వారి తమ్ముడిని వారి కుటుంబసభ్యులకు అప్పగించినందుకు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గట్టు గిరి గారు,రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
@matrudevobhavaanadhaashramam @mathrudevobhavasevalu @Bharosa464
#rebirth #mathrudevobhava #humanity #handover
Негізгі бет 5 సం.రాల క్రితం తప్పిపోయి చనిపోయాడు అనుకున్న వ్యక్తిని కుటుంబసభ్యులకు అప్పగించిన మాతృదేవోభవ
Пікірлер: 118