Please Subscribe For More Videos
ఆ రాత్రిలో నింగిలో ఒక తార - గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి (2)
జ్ఞానులు కనుగొనిరి ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు || ఆ రాత్రిలో ||
1. ఆ కాలములో ఉన్న జ్ఞానులు - ఖగోళ వింతను వీక్షించిరి (2)
ఏదో జరిగెనని ఈ లోకంలో - అన్వేషించుచు చేరెను బెత్లేహెం (2)
యూదుల రాజైన యేసుక్రీస్తును - దర్శించి పూజించి ఆరాధించిరి
బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి || ఆ రాత్రిలో ||
2. ఆ కాలములో ఉన్న గొల్లలు - రాత్రిజామున మందను కాయుచుండగా (2)
దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త - రక్షకుడేసుని చూచిరి గొల్లలు (2)
లోక రక్షకుడు యేసు క్రీస్తును- కనులారా వీక్షించి సంతోషించిరి
చూచినవి అందరికి చాటించిరి || ఆ రాత్రిలో ||
Негізгі бет Фильм және анимация Aa Ratrilo || Cover Song by Akshaya || Enosh || Christmas Song
Пікірлер: 41