నాలుగేళ్ళప్పుడు నృత్యం పట్ల నాలోని ఆసక్తిని పసిగట్టారు నాన్న. మా అమ్మమ్మ కూడా గమనించింది. ఐదవ యేట వెంపటి చినసత్యం గారి వద్ద శిక్షణ మొదలు పెట్టాను.
ఇప్పటివరకు కూడా వెను తిరిగి చూసిందే లేదు.. అంతా అమ్మానాన్నల ప్రోత్సాహాలే. నాన్నగారి సామర్థ్యత. అమ్మ చేయూత వల్ల నర్తకినవ్వాలన్న నా కలలు సాకారమయ్యాయి.
2009 లో .. అంతర్జాతీయ కూచిపూడి ప్రపంచ సభల్లో .. కేవలం నాన్నగారి కోసం హైదరాబాద్ కి వచ్చి ప్రదర్శన ఇచ్చాను.. నాన్న ఎంతో సంతోషించారు..
అయితే, "గజ్జెలు తీసి దేవుని వద్ద ఉంచు" ఇకపోతే, నీవు చిన్నప్పుడు కధలు రాసి వినిపించే దానివి కదా! ఇక నుండి చక్కగా రచనలు సాగించు." అన్నారు.. నాన్న మాట శిరసా వహించవలసిందే. అలా అడుగు పెట్టాను రచనావ్యాసంగం దిశగా..
Негізгі бет ఆడమన్న వారే ఆగమన్నారు. హస్తముద్రల బదులు కలం పట్టమన్నారు. నాన్నే నన్ను సాహిత్యానికి చేరువ చేశారు..
Пікірлер