Bonalu Song 2019 | Telangana Bonalu Special Song 2019 | Varam | Bhole | #BonaluSong | Y5 tv #BonaluSong #BonaluSongs #BonaluSongs2018 #telanganaBonaluSongs.
Bonalu is the State Festival of Telangana, during which Godess Mahakali is Worshiped. After the Formation of Separate state of Telangana, Bonalu has been declared as the State festival by government of Telangana.
Bonalu is Celebrated in the Ashadam Masam i.e, in the month of July or August. Majorly Bonalu is celebrated in the twin cities of Hyderabad and Secunderabad of which Golconda Bonalu, Balkampet Bonalu and Mahankali Bonalu are very famous. A part from the twin cities, almost all other parts in the state of Telangana also Celebrate the Festival.
Our Bonalu Song 2018 explains the different types of Bonalu offerings in all the 31 districts of Telangana State. Among all the songs made on Bonalu. Our song out-stands them in uniqueness of explaining all the various types of Bonalu offering to different goddess worshiped in various districts of Telangana State.
బోనం కుంకుమ బొట్టు
దిద్దూకుంది బోనం
బోనం పసుపూ గంధం
రాసుకున్న బోనం
మా ప్రాణం ...ఈ బోనం
పల్లవి:
తెలంగాణ గడ్డ మీద బోనం
31 జిల్లాల ప్రాణం
గోలుకొండ కోటల తొలి బోనం
ప్రపంచమంత చుట్టెను మన బోనం
పోచమ్మ తల్లి ,మైసమ్మ తల్లి
ఎల్లమ్మ తల్లి , పెద్దమ్మ తల్లి
సల్లని తల్లులు గానాలు మాకు
దీవెనలియ్యంగ రావాలి మీరు
బోనం......
ఆషాడ మాసాన బోనం
అవని మీద అంగరంగ వైభవం
శ్రావణాన సక్కనైన బోనం
మా పాడి పంటకు ఇచ్చెను ధైర్యం
బోనం పట్టు చీర కట్టూకుంది-బోనం
బోనం పల్లే-పట్నం చుట్టి వచ్చే -బోనం
ఈ బోనం - మా దైవం
చరణం:
అరె తీన్ మాన్ దరువులతో
ఊరంత ఊగింది
ఊగిసలాడింది
ఊరు గాసే తల్లి బోనం
అరె ఊదుపొగల ఘుమఘుమ తో
జమిడిక మోతల్లో
లల్లాయి పాటల్లో
లేసి ఆడింది బోనం
ఓరుగల్లులోన
ఐలోని మల్లన్న తీర్థం
భద్రకాళి అమ్మ
ఎత్తుకుంది బోనం
సత్యంగల్ల బోనమే
అగో సమ్మక్క సారక్కకిద్దామే
ఏ భూపాలపల్లి, కోటంచుదుర్గమ్మ
కొంగు బంగారం నీవే. నీకు.... బోనం....
మానుకోట ముత్యాలమ్మా బోనం
నీ పడగ నీడనే నిలుచును ప్రాణం
నిండడివిలో గుంజేడు ముసలమ్మకూరా
పిల్ల జల్లతోని ఎత్తుకుందం బోనం
చరణం 2
అహ కరీంనగర్ జిల్లాలోన
కంకణాన్ని కట్టి కాలి గజ్జెపెట్టి
కదలి వచ్చింది బోనం
అహా జగిత్యాల జిల్లాలోన
జగ జగ జగ జంగమయ్యబిడ్డ
కెత్తుకున్న రయ్యో బోనం
వేముల వాడలోన
బద్దీపోచమ్మ బోనం
పెద్ద పల్లిలోన
ఒదేలు మల్లన్న బోనం
యాదాద్రి నర్సన్న
దీవించిన బోనం
భోనగిరి రేణుక ఎల్లమ్మ
పిలిచిన పలికే దేవత నీవమ్మ ఎల్లో......
అరె నల్లగొండ జడలరామ లింగేశ్వరం
ఆడ పరుషురాముని తల్లికి బోనం
సూర్యపేట ఎత్తుకుంది బోనం
దండు మైసమ్మకు దండి బోనం
చరణం 3
అరె ఫతెపూరు మైసమ్మకు
పాలమూరు ఊరు ఊరు
ఎత్తుకుంది బోనం
ఎహే... నాగర్ కర్నూల్ లోన
గురుమూర్తికి దాసంగా
నైవేద్య బోనం
నయనం పల్లి మైసమ్మ
వనపర్తి బోనం
గద్వాల జోగులాంబ
దీవించే నేత్రం
అదిలాబాదు ఆడెల్లి పోచమ్మ
అసిఫాబాదు బుయ్యారి పోచమ్మ
మంచిర్యాలలోన గాంధారి పోచమ్మ
నిర్మల్ బొమ్మకు పోసింది ప్రాణం -బోనం
నిజాంబాదు మర్రిచెట్టు ఆలయం
కామారెడ్డికి కాలభైరవ ధైర్యం
ఎల్లమ్మ గుట్టల జల జాతర
ఎత్తెత్తు బోనాల యాతర
బోనం తెలంగాణా
కిరిటమే బోనం
బోనం మా పిల్ల పాపల
సల్లంగ జూసే బోనం
ఈ బోనం-మా ధైర్యం
చరణం 4
అరె ఏడూ పాయల దుర్గమ్మ
మెదక్ లోన వెలిసిన తల్లి
సల్లని నీ దయ గలగాలే తల్లి
అహా సిద్ధిపేట సిరుల ఫలం
కొమిరేల్లి మల్లన్న కెత్తిన బోనం
పసుపు బండారి బెట్టుకుందాం
ఖమ్మం జిల్లలోన
గుబ్బాల మంగమ్మ
భద్రాద్రి రాముడికి
మొక్కుతుంది మాయమ్మ
మైసిగండి లోన మైసమ్మ
మమ్ముల కావగ రావమ్మ
వికారాబాదు అడవి తల్లే
అమ్మవారి ఆకారమయ్యే -బోనం
హైద్రాబాదు గడ్డ మీద మోతరా
బస్తి బస్తి బోనమెత్తి
మురిసేను గదరా
ధూప , దీప నైవేద్యం తల్లికి ప్రాణం
నిలుపుతాది నిండుగ
ఆ తల్లే ప్రాణం
చరణం 5
ఏ బల్కంపేట బాయిలోన
బంగారు రూపాన్ని
దాల్చినవమ్మా
కష్టాలుకన్నీళ్ళు తుడిచినవమ్మా
అరె జూబ్లిహిల్సు కొండపైన
పెద్దపులిని వాహనంగా మార్చినవమ్మా
ఏడంతస్తుల బోనం ఎత్తితిమమ్మా
సికింద్రాబాదులోన
మాంకాళి తల్లికి
తొట్టెలే కట్టితిమమ్మా
అడెడెడెడెడె ఘటం
గండదీపం శివసత్తులూగె
సిత్రం,పోతరాజు పొలికేకలు
పాత బస్తి మాంకాళికి
రంగాన్ని ఎక్కి
భవిష్యత్తులు జెప్పి
గండాలు బాపేటి
తల్లులు మీరే బోనం
అరె అమెరికాలో కొలుస్తున్న బోనం
ఆస్ట్రేలియా ఒడిలో కొలుస్తున్న బోనం
దుబాయి,లండన్ లోన బోనం
అమ్మవార్ల రూపమెత్తే వైనం
సంద్రాలే దాటి తెలంగాణా బోనం
మన గౌరవాన్ని చాటింది బోనం
=======================
Bonalu Song 2018 :
Lyrics : Manukota Prasad
Singers : Varam & Bhole
Music : Bhole
Camera : Pradeep Reddy.K & Gangadhar
Editor: Prasad Yadav
Producer: BheenRaj Marla
Presentation : Y5TV
Watch Y5TV for Latest Movie updates, Latest News, Breaking News, Songs, Film Gossips, Health Tips, Exclusive interviews, Comedy Shows, Cooking Videos, Live Debates and many more....
Subscribe to Y5tv: / @totnewstelugu
Facebook: / sai.deekshitha.7393
Facebook Page: / y5tv-1266395933465288
Twitter: / y5tvmedia
Linkedin: / y5-tv-6657ab151
instagram: www.instagram....
Website: Visit Us: www.y5tv.in/
Негізгі бет Bonalu Song 2019 | Telangana Bonalu Special Song 2019 | Varam | Bhole |
Пікірлер: 371