బ్రహ్మంగారి మఠం చేరుకున్నాక శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని
మరియు వారు నివసించిన గృహం దర్శించడం జరిగింది.
అమ్మ వారి గ్రామ ఉత్సవానికి గ్రామ పెద్ద చందా అడగగా తాను ఇవ్వలేనని,ఆర్ధికంగా ఇచ్చే స్థోమత తమది కాదని మీకు సమ్మతమైతే చిన్నపాటి ఉత్సవ రథం తయారు చేసి ఇస్తానని స్వామి తెలపగా సమ్మతించక పోగా నిత్యావసరాలు వారికి చేరకూడదని ఆంక్ష పెట్టారు గ్రామంలో
ఆ సందర్భంలో నీటి కోసం ఇంటి ఆవరణలో
జింక కొమ్ముతో రాత్రికి రాత్రే 125 అడుగుల బావిని స్వామి వారు స్వయంగా తవ్వారు.
అప్పటివరకు సాధారణ వ్యక్తిగా భావించిన గ్రామస్తులకు బ్రహ్మం గారు మహిమాన్వితుడని పోలేరమ్మ వారు విశదపరిచినది ఈ రచ్చ బండ వద్దే.
గ్రామస్థులతోపాటు భక్తులు విరివిగా వస్తున్నారు ఈ శాల వద్దకు.4దశాబ్దాలుగా నిష్ఠ పూర్వక నిర్వహణలో శుచి-రుచి గల ఆహారం లభిస్తుండటం వలన.
ఇడ్లీ,దోశ, కారం దోశ నాలుగు రకాల జోడింపులతో అందిస్తారు. తక్కువ ధరలో ఆకలి తీరుతుంది ఇక్కడ.
కావాల్సిన మేరకు నూనె వినియోగించి ఇరువైపులా సమత్వంగా కాల్చారు దోశను. దరిమిలా ఆహారంకు వచ్చిన వర్ణిక నాణ్యతను ప్రతిబింబించగా లోగల ఉపాహార రుచి ఊహకొచ్చింది చూడగానే.
ఇక పచ్చడి అద్ది రుచి చూడగా నోరూరింది తొలుత. ఆకృతి విసుమంత దళసరిగా ఉన్నా నుంపారుగా నలిగింది తర్వాత. పచ్చడి ఒద్దికై సంతృప్తికర రుచి సృజించింది చివరిగా.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Негізгі бет Brahmam Gari Matam Bamma Gari Dosa | Sri Pothuluri Veera Brahmendra Swamy Matam | Food Book
Пікірлер: 219