"స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక." ప్రకటన Revelation 5:13 పల్లవి: మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ. నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక ! 1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి (2) జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు (2) నీ జ్ఞానమును - వివరింపతరమా (2) నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము 2. వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడా శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము 3. అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా నీ కసాద్యమైనది లేదే యెహోవా నీ సర్వశక్తిని - వివరింపతరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు 4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ కొలువగలేము నీ - ఘనప్రేమను సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము 5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని అగపె ప్రేమను - వివరింప తరమా అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు
Пікірлер: 11