ఏదారి ఏచ్చటికో శంకరా.
శివరంజని రాగం. ఆది తాళం
హార్మోనియం. వెంకట్రామిరెడ్డి
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
డౌలక్. రామాంజి.
కోరస్. గండి భజన బృందం.
సాకి. శంకరా... పరమేశ్వరా... ఆ... ఆ... ఆ..
పల్లివి. ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర.
కడదాకా ఎవరో చితిదాకా ఎవరో
ఎవరికి ఎవరో.... చివరి ఎవరో
సంకట హరణ చూపుము కరుణ
నాగాభరణ గౌరీ రమణా....
"ఏదారిఏచ్చటికో "
చరణం.1
...............
మాయలో పుట్టేము మాయలో పెరిగేము."2"
పెనుమాయలో తెలియాడేము."2"
నీమాయ మేమెరుగక మాయమై పోయేము.
మామాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు.
మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర..
"ఏదారిఏచ్చటికో "
చరణం 2
..............
శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు."2"
చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే "2"
నీశ్లోకమేమెరుగకశోకములోమునిగేము."2"
మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు.
మమ్ము కావా రావా.. శంభో శంకరా హర.
" ఏదారి ఏచ్చటికో "
చరణం 3
..............
తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి "2"
తలచేది జరగక తల్లడిల్లెమయ్యా "2"
నీవాడించేవు తోలు బొమ్మలాట "2"
నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను
మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర..
"ఏదారి ఏచ్చటికో "
Негізгі бет ఏదారి ఎచ్చటికో శంకరా. ఎవరి దారి ఎచ్చటికో హర హర.లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నవి
Пікірлер: 121