Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-05-2024 |
అన్నియు నీవేనయ్యా - అన్నియు నీవేనయ్యా
బలవంతుడు - బలహీనుడు
ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా
1. దరిచేరలేని పడవవలె - ఏకాకిగా పరితపిస్తున్నా
చేయూతనిచ్చేవారు లేరు - మార్గమేమి కనబడలేదు
నిన్ను మాత్రమే నమ్మియున్నా
గుర్తించేవారేలేరు - గుర్తించు నా ప్రభువా
అన్నియు నీవేనయ్యా - అన్నియు నీవేనయ్యా
2. గాలివాన లేకున్నను - లోయ నీటితో నిండునన్నావే
క్లిష్ట పరిస్ధితుల్ నిశ్చయం మారున్ - ఒకమాట పలికితే చాలున్
నిన్ను మాత్రమే నమ్మియున్నా
తోడుండి నా చేయిపట్టి - నడిపించు నా ప్రభువా
అన్నియు నీవేనయ్యా - అన్నియు నీవేనయ్యా
3. లోకాధిపతి వచ్చినా నీపై - ప్రభావమేమీ ఉండదన్నావే
లోకములో ఉన్నవానికంటే - నాలో ఉన్నవాడు గొప్పవాడన్నాడే
నిన్ను మాత్రమే చూచెదను
నా కోసం యుద్ధం చేసి - జయమిచ్చి నడుపుమయ్యా
అన్నియు నీవేనయ్యా - అన్నియు నీవేనయ్యా
4. సింహ పిల్లలు ఆహారం లేక - అలమటించినను ప్రభువా
నిన్ను ఆశ్రయించే మాకు - ఏ కొడవయు ఉండదన్నావే
నిన్ను మాత్రమే నమ్మియున్నా
సమకూర్చే వాడవు నీవే - సమకూర్చి నడుపుమయ్యా
అన్నియు నీవేనయ్యా - అన్నియు నీవేనయ్యా
5. కలగబోయే శ్రమలను గూర్చి - భయపడకుడి అని అన్నావే
బాధలు పది రోజులకే - ఇస్తావే జీవకిరీటం
నిన్ను మాత్రమే నమ్మియున్నా
శ్రమలన్ దాటించి - మహిమతో నడుపుమయ్యా
అన్నియు నీవేనయ్యా - అన్నియు నీవేనయ్యా
Негізгі бет Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-05-2024 |
Пікірлер: 220