దుర్గమ్మ తల్లి పాట (అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే
బెజవాడ దుర్గ భవాని వని వచ్చిందే)
#telugu
#telugusongs
#bhajanapatalu
#devotionalsongs
#telugubhajanapatalu
పల్లవి:-
అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే
బెజవాడ దుర్గ భవాని వచ్చింది
ముగ్గురమ్మల మూలపుటమ్మ
సృష్టికి మూలం నీవేనమ్మ
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించే ఆదిశక్తి
చరణం:-1
కృష్ణా నదిలో జలకమ్మాడి కాళ్ళకు పారాణి బెట్టి
ముఖమంతా పసుపు తోటి బొట్టు పెట్టి
కాళ్లకు గజ్జలు కట్టుకొని కళ్ళకు కాటుక పెట్టుకుని
పట్టు చీరలే కట్టుకోని మహాలక్ష్మిలా వచ్చే తల్లి
చరణం:-2
కంచిలోన కామాక్షి నీవే మధురలోన మీనాక్షి నీవే
గంగానమ్మ తల్లివి నీవే కలకత్తా కాళీ మాతవు నీవే
చేతికి గాజులు వేసుకుని చేతిలో శూలము పట్టుకొని
పెద్దపులిని ఎక్కి వచ్చి ముల్లోకాలు తిరిగే తల్లి
Негізгі бет దుర్గమ్మ తల్లి పాట (అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందేబెజవాడ దుర్గ భవాని వని వచ్చిందే) devotional song
Пікірлер