హైదారాబాద్ లో మూడు సం||లు ఒక్కదాన్నే ఉన్న నేను 2019 సెప్టెంబర్ 2న. ఈ విధంగా మొదటి ఫిజికల్లీ చాలెంజ్డ్ మహిళ జయతో డిజేబుల్స్ కోసం ఉచిత వసతి గృహం లా ప్రారంభించాను.
ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ఏం లేదు, నేను చేసే కార్యక్రమాలకి నేను,
నా సంపాదన ఒక్క చేతి టైపు వర్క్ తో నేనే వంట, ఇంటి పని అంతా చేసేట్టు అయితే 5000. మిగతా డిజేబుల్స్ హెల్ప్ చేసెట్టు అయితే 7000 ఇంతే! ఇదే నా స్థాయి. మా తమ్ముడు నెలకో 3000 యిచ్చేవాడు.
ఈ మొత్తం నాలుగురైదుగురు డిజేబుల్స్ ఉండే క్రమంలో సరిపోవు అని ఎవరికి అయినా అర్ధం అవుతుంది. మిగతా అంతా నా పట్టుదల.. నేను చేసే వర్క్స్ అన్నీ సామాజిక మాధ్యమాల్లో చూసి నాకు గానీ, నా హోమ్ లో ఉండే వాళ్ళకి గానీ ఏ మాత్రం రక్త సంబంధం మా కుటుంబాలతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు స్పందించి, సహృదయంతో వారు చేసిన సహాయాలే ఇంత కాలం కొనసాగటానికి కారణాలు. 🙏 🙏 వాళ్లందరికీ నా తరపున మా వికలాంగుల టీం తరపున వేల ధన్యవాదాలు
Негізгі бет ఆద్యా నిలయం 2019-సెప్టెంబర్-2.
Пікірлер: 4