గోబీ పులావ్ | Gobi Pulao | Cauliflower Rice | Gobi Rice Recipe in Telugu | Cauliflower Pulao@HomeCookingTelugu
గోబీ పులావ్ చాలా త్వరగా చేసుకునే రెసిపీ. ఈ వీడియోలో చూపించిన విధంగా పులావును చేసుకుంటే, క్యాలీఫ్లవర్ అంటే నచ్చనివాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని రైతాతో కానీ గ్రేవీతో కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది. ఈ వన్-పాట్ మీల్‌ను తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#gobipulaointelugu #homecookingtelugu #gobipulao #gobipulaorecipe #hemasubramanian #homecooking #pulaorecipes #gobiriceintelugu #gobirice #cauliflowerpulao #cauliflowerrice #ricerecipes
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
Here's the link to this recipe in English: bit.ly/3c5XktL
తయారుచేయడానికి: 30 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 3
క్యాలీఫ్లవర్ సీసనింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
క్యాలీఫ్లవర్ - ఒక మీడియం సైజు
ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
పసుపు - 1 /4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
ఎండుకారం - 1 టీస్పూన్ (Buy: amzn.to/3b4yHyg)
గోబీ పులావ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్ (Buy: amzn.to/2RBvKxw)
నూనె - 1 టేబుల్‌స్పూన్ (Buy: amzn.to/2RGYvrw)
దాల్చిన చెక్క (Buy: amzn.to/31cpSxL)
లవంగం (Buy: amzn.to/36yD4ht)
యాలకులు (Buy: amzn.to/2U5Xxrn)
మిరియాలు (Buy: amzn.to/2RPGoRp)
అనాస పువ్వు (Buy: amzn.to/37JQNnl)
జాపత్రి (Buy: amzn.to/2uLpr1n)
బిర్యానీ ఆకు (Buy: amzn.to/31cpSxL)
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్ (Buy: amzn.to/314FymX)
టొమాటోలు - 2 (పొడవుగా తరిగినవి)
ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
సీసన్ చేసిన క్యాలీఫ్లవర్
తరిగిన కొత్తిమీర
గరం మసాలా పొడి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2TPe8jd)
బాస్మతి బియ్యం - 1 కప్పు (Buy: amzn.to/2RD40bC)
నీళ్లు - 2 కప్పులు
తయారుచేసే విధానం:
ముందుగా క్యాలీఫ్లవర్‌ను బాగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేయాలి.
ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి పావు గంట పక్కన పెట్టుకోవాలి
ఒక ప్రెషర్ కుక్కరులో నెయ్యి, నూనె వేసి, అందులో మసాలా దినుసులు వేసి వేయించిన తరువాత, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించాలి
తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించిన తరువాత టొమాటోలని వేసి వేయించాలి
టొమాటోలు కొద్దిగా మగ్గిన తరువాత ఉప్పు వేసి కలుపుకోవాలి
ఆ తరువాత, సీసన్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలని కూడా వేసి. గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
ఇప్పుడు, పదిహేను నిమిషాల పాటు నీళ్ళల్లో నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి
ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి
ఇదంతా బాగా కలిపి, కుక్కరుకి ఒక మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, పులావుని రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
అంతే, ఈ వేడివేడి గోబీ పులావును ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZitem: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...
Негізгі бет గోబీ పులావ్ | Gobi Pulao | Cauliflower Rice | Gobi Rice Recipe in Telugu | Cauliflower Pulao
Пікірлер: 41