రష్యాతో యుద్ధంతో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు మరింత అండగా నిలిచేందుకు జీ-7 దేశాలు ముందుకొచ్చాయి. ఈ దేశానికి 4.17 లక్షల కోట్లు రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో జీ-7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు 21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేసి ఉన్నాయి. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్న దానిపై జీ-7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా ప్రస్తుతం స్తంభింపజేసిన ఈ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదని అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్ కు అందనున్నాయి. ఇవాళ దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZitem Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет G7 Agrees $50bn Loan For Ukraine From Frozen Russian Assets |ఉక్రెయిన్‌కు - జీ-7 దేశాల ఆర్థిక సాయం
Пікірлер: 1