Original Composition and Lyrics:
Ramesh Anna - Hosanna Ministries
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
Негізгі бет Ghanamainavi Nee Karymulu | ఘనమైనవి నీ కార్యములు | Dr. Betty Sandesh | Hosanna Songs | LCF Church
Пікірлер: 157