Golkonda fort bonalu 2022 // Hyderabad telangana bonalu 2022 // Bonalu in telugu 2022 part 1
#bonalu #golkondafort #2022 The true spirit of rituals of culture... Despite of incessant rain fall the devotees have not step back to celebrate Bonalu....They gave a tremendous mark of their presence in Golkonda Bonalu. Bonalu 2022 in Telangana began on
Sunday, 3 July
and ends on
Sunday, 24 July ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
బోనంలో ఏముంటుంది..?
వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి , ఇత్తడి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుతో ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ గ్రామ దేవతా గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారు.
Негізгі бет Golkonda fort bonalu 2022 // Hyderabad telangana bonalu 2022 // Bonalu in telugu 2022 part 1
Пікірлер: 2