#GurramJashuva#Rangasthalam#Satyaharichandra
Gurram jashuva smasana vatika padyalu explained by vv krishna in telugu.
Like our page: / rangasthalamdrama
Timeline :
3:57
ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్ లేచిరాఁ, డక్కటా!
యెన్నా ళ్ళీచలనంబు లేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్!
5:30
ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని-కలము, నిప్పులలోనఁగఱఁగిపోయె!
యిచ్చోట; నేభూము లేలు రాజన్యుని-యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ-సలసౌరు, గంగలోఁగలసిపోయె!
యిచ్చోట; నెట్టిపే రెన్నికం గనుఁగొన్న-చిత్రలేఖకుని కుంచియ, నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు-గజ్జె గదలించి యాడు రంగస్థలంబు;
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ-నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
10:33
ముదురుతమస్సులో మునిగిఁపోయిన క్రొత్త సమాధిమీదఁ బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా?
హృదయముసుమ్మి, నిల్పిచనియె న్గతపుత్రిక, యే యభాగ్యయో!
13:15
వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలఱాతిగో
రీకడఁ బారవేయఁబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే
యాకటిచిచ్చునన్ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ
నోకద! వానికై వగవఁ డొక్కండు; దాఁచదు కాటినేలయున్
18:00
ఆకాశంబును కాఱుమబ్బుగము లాహారించె; దయ్యాలతో
ఘూకంబుల్ చెరలాడసాఁగినవి; వ్యాఘోషించె నల్దిక్కులన్
గాకోలంబులు; గుండె ఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
దా కల్లాడిన జాడ లే; దిచట సౌఖ్యం బెంత క్రీడించునో!
20:54
కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ స్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁ డల కాళిదాస భా
రవు ల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కదా! కుమ్మరివాని సారెపై
23:19
ఆలోకించిన గుండియ ల్గరంగు; నాయా పిల్లగోరీలలో
నే లేబుగ్గల సౌరు రూపఱియెనో! యేముద్దు నిద్రించెనో!
యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?
27:00
ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు; విశ్వంభరా
నటనంబున్ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్జేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్
Uppla Padu saidulu intervew : • రంగస్థల ప్రస్థానం కార్...
Satya Harichandra Padyalaku bhavalu : • హరిశ్చంద్ర పద్యాలకు అ...
Gurram jashuva padayalu by chemakurti : • గుర్రం జాషువా పద్యాలు ...
కళాభిమానులకు రంగస్థలం ఛానల్ తరపున కళాభివందనములు , మరిన్ని వీడియోస్ కోసం మాఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోవాల్సింది గ కోరి ప్రార్ధన. ధన్యవాదములు
Uppla Padu saidulu intervew :
• రంగస్థల ప్రస్థానం కార్...
Satya Harichandra Padyalaku bhavalu :
• హరిశ్చంద్ర పద్యాలకు అ...
Gurram jashuva padayalu by chemakurti :
• గుర్రం జాషువా పద్యాలు ...
కళాభిమానులకు రంగస్థలం ఛానల్ తరపున కళాభివందనములు , మరిన్ని వీడియోస్ కోసం మాఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోవాల్సింది గ కోరి ప్రార్ధన. ధన్యవాదములు
Негізгі бет Gurram Jushava |జాషువా పద్యాలకు అర్దాలు|Satya Harichandra Drama
Пікірлер: 192