షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 17 ||షిరిడి చావడి ఉత్సవాన్ని అలనాటి భక్తులు ఎంత అద్భుతంగా చేసేవారో తెలుసా!ఈ వీడియో చూడండి తెలుస్తుంది// Shiridi SaiBaba Story // SaiLeela ||
బాబా ఒకరోజు మసీదులోను, ఇంకొకరోజు చావడిలోను నిద్రిస్తూ ఉండేవారు. మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందేవరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రిస్తూ ఉండేవారు. 1910 డిశంబరు 10వ తేదీనుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరపడం మొదలుపెట్టారు.చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజనబృందం వెనుక రథం, కుడివైపు తులసీబృందావనం, ముందర బాబా వీటి మధ్య భజన జరుగుతుండేది. భజనలో ప్రీతి కల స్త్రీపురుషులు సరియైన కాలానికి వస్తుండేవారు. కొందరు తాళాలు, కొందరు చిరతలు, మృదంగం, కంజీరా, మద్దెలలు పట్టుకుని భజన చేస్తుండేవారు. సూదంటురాయిలా సాయిబాబా భక్తులందరినీ తన వద్దకు ఈడ్చుకునే వారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేస్తూ ఉన్నారు. కొందరు పల్లికిని అలంకరిస్తూ ఉన్నారు. కొందరు బెత్తాలను చేత ధరించి 'శ్రీసాయినాథ మహారాజ్ కీ జై!' అని కేకలు వేస్తూ ఉన్నారు. మసీదు మూలాలు తోరణాలతో అలంకరిస్తూ ఉన్నారు. మసీదు చుట్టూ దీపాలవరసలు కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. బాబా గుఱ్ఱం శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుని ఉండేది. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవారు.బాబా నిశ్చలంగా కూర్చునేవారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుతూ ఉండేవారు. తాత్యా బాబాను 'మామా' అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యం అత్యంత సన్నిహితమయినది. బాబా శరీరంపై మామూలు కఫినీ వేసుకుని చంకలో సటకా పెట్టుకొని, చిలుముని పొగాకును తీసుకొని పైన ఉత్తరీయం వేసుకొని, బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తరువాత తాత్యా జలతారు శెల్లానుబాబా ఒంటిపై వేసేవాడు. అటు తరువాత బాబా తన కుడిపాదం బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుతున్న దీపాన్ని ఆర్పి, చావాడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యాలు మ్రోగేవి; మతాబు, మందుసామానులు అనేక రంగులు ప్రదర్శిస్తూ కాలేవి. పురుషులు, స్త్రీలు బాబా నామాన్ని పాడుతూ మృదంగం. వీణలసహాయమ్తో భజన చేస్తూ ఉత్సవంలో నడుస్తుండేవారు. కొందరు సంతోషంలో నాట్యంచేస్తూ ఉన్నారు. కొందరు జెండాలను చేత పట్టుకుంటుండే వారు. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు 'శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై!' అని కేకలు పెడుతూ ఉన్నారు. బాబాకి ఇరుపక్కల చామరాలు మొదలినవి పట్టుకుని విసురుతూ ఉన్నారు. మార్గమంతా అడుగులకు మడుగులు పరిచేవారు. వాటిపై బాబా భక్తుల నడిచేవారు. తాత్యా ఎడమచేతిని, మహాల్సాపతి కుడిచేతిని, బాపు సాహెబుజోగ్ శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకునే వారు. ఈ ప్రకారంగా బాబా చావాడికి ప్రయాణమవుతుండేవారు.
Google Map For Varala Sai Mandiram //గూగుల్ మాప్@వరాల సాయి మందిరం:www.google.co....
Google Map For Sai Tv // గూగుల్ మాప్ @సాయి టీవీ:www.google.co....
"Sai Tv" Live: / @saitvlivetelugu
Негізгі бет షిరిడి చావడి ఉత్సవాన్ని అలనాటి భక్తులు ఎంత అద్భుతంగా చేసేవారో తెలుసా!ఈ వీడియో చూడండి తెలుస్తుంది.
Пікірлер: 67