జీడిపప్పులు వేసి పులావు చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియోలో సింపుల్ జీడిపప్పు పులావు ఎలా చేయాలో మీరు చూడచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#jeedipappupulao #homecookingtelugu #cashewpulao #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
Here's the link to this recipe in English: bit.ly/3p4znuK
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 250 మిల్లీలీటర్లు
నీళ్లు
నెయ్యి - 3 టీస్పూన్లు
దాల్చిన చెక్క
బిర్యానీ ఆకు
అనాస పువ్వు
యాలకులు - 3
లవంగాలు - 5
జాపత్రి
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
జీడిపప్పులు - 100 గ్రాములు
ఉల్లిపాయలు - 2 (స్లైసులుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్లు - 1 3/4 కప్పులు
తయారుచేసే విధానం:
ఒక బౌల్లో శుభ్రంగా కడిగిన బాస్మతి బియ్యాన్ని వేసి, పదిహేను నిమిషాలు నీళ్లలో నానపెట్టాలి
ఒక ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి, అందులో దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి, జీలకర్ర వేసి వేయించిన తరువాత జీడిపప్పులు కూడా వేసి రంగు మారేంత వరకూ వేయించాలి
జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తరువాత ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకూ వేయించాలి
ఆ తరువాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, నానపెట్టిన బాస్మతి బియ్యం, వేసి కలిపిన తరువాత నీళ్ళు పోసి, కుక్కరుకి మూత పెట్టి, పొయ్యిని మీడియం-హై ఫ్లేములో ఉంచి, రెండు విజిల్స్ వచ్చేంత వరకూ పులావును ఉడికించాలి
అంతే, జీడిపప్పు పులావు తయారైనట్టే
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZitem: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...
Негізгі бет జీడిపప్పు పులావ్ | Cashew Pulao | Veg Recipes | Pulao Recipes | Simple Pulao
Пікірлер: 71