జయ జయ జయహే భారతీ - జగమంత కోరు నీ సంస్కృతి ౹౹ 2 ౹౹
జీవజాతులకు అంతేలేదు - వైరుధ్యానికి తావేలేదు
ప్రకృతితో పెనవేసిన బంధం - పరస్పరమ్ము స్వయంపూరకం
ఇదేమి తంత్రం అదే విచిత్రం - ప్రాణికోటి ఆరాధన మంత్రం ౹౹ 2 ౹౹
అనాదిగా ఇది మనకు ప్రబోధం - పునాదిగా ప్రభవించిన వేదం ౹౹ జయ జయ జయహే ౹౹
తల్లి వైభవం తలపున ఉంచి - సమర్పణమ్మును మనసున ఎంచి
ఒరిగిన వీరులు తెగిన కంఠములు - ఆజన్మాంతపు జీవన సమిధలు
పరచిన దారిలొ నడచిన సేనలు - పరిత్యజించెను సర్వసుఖమ్ములు ౹౹ 2 ౹౹
పుడమీ పుత్రుల బంధం చూసి - ప్రపంచమే ప్రణమిల్లెను మురిసి ౹౹ జయ జయ జయహే ౹౹
ప్రతీ మొక్క ఒక వృక్షమవ్వగ - చుక్క చుక్క ఒక నదిగ మారగ
అరమరికల అంతరములు మరిచి - అంటరానితనమన్నది తుడిచి
పల్లె పల్లెలో ప్రతీ ఇంటిలో - సంఘమంత్రమే ప్రతిధ్వనించగ ౹౹ 2 ౹౹
పరమవైభవం తీరం చేరగ - పయనించెద మీ మేను నావగ ౹౹ జయ జయ జయహే ౹౹
Негізгі бет #జయ
Пікірлер: 1