ఈ ద్వాదశ ఆదిత్యులు గురించి కాశీ ఖండం 46, 47, 48, 49, 50, 51 అధ్యాయాలలో ప్రస్తావించారు.
1) లోలర్క ఆదిత్యుడు
maps.google.com/?cid=48540167...
2) విమల ఆదిత్యుడు
maps.google.com/?cid=17786980...
3) సాంబ ఆదిత్యుడు
maps.google.com/?cid=60540610...
4) ఉత్తరార్క ఆదిత్యుడు
maps.google.com/?cid=13996839...
5) కేశవ ఆదిత్యుడు
maps.google.com/?cid=83861502...
6) ఖఖోల్క ఆదిత్యుడు
maps.google.com/?cid=17584961...
7)అరుణ ఆదిత్యుడు
maps.google.com/?cid=13657183...
8) మయూఖ ఆదిత్యుడు
maps.google.com/?cid=13029910...
9) యమ ఆదిత్యుడు
maps.google.com/?cid=12200389...
10) వృద్ధ ఆదిత్యుడు
maps.google.com/?cid=12612803...
11) గంగా ఆదిత్యుడు
maps.google.com/?cid=43358052...
12) ద్రౌపది ఆదిత్యుడు
+91 542 239 2619
maps.google.com/?cid=12372421...
ముందుగా లోలార్క ఆదిత్యుని దర్శనం చేసుకుందాము. కాశీలో తెలుగు వారు ఎక్కువగా ఉండే ఆంధ్ర ఆశ్రమం మెయిన్ రోడ్ సోనార్ పుర జంక్షన్ నుండి అసి ఘాట్ వైపు వెళ్ళే ఆటోలు మార్వాడి సేవా సంఘం దగ్గర దింపుతారు. అక్కడ నుండి లోలార్క కుండం చాలా దగ్గర. ఈ కుండం దగ్గరే లోలార్క ఆదిత్యుని గుడి ఉంది.
లోలార్క ఆదిత్యుని తరువాత విమల ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. లోలార్క ఆదిత్యుని గుడి నుండి మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తరువాత ఆటో ఎక్కి జంగంబాడి దగ్గర దిగాలి. ఎదురు రోడ్ లో వెళితే ఆంధ్ర ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి ఎదురుగా ఉన్న సందులో ఉంది విమల ఆదిత్యుని ఆలయం.
విమల ఆదిత్యుని దర్శనం తరువాత సాంబ ఆదిత్యుని గుడి వెళ్ళండి. ఈ గుడి సూరజ్ కుండ్ అనే ప్రసిద్ధ ప్రాంతంలో ఉంది. విమల ఆదిత్యుని గుడి నుండి మెయిన్ రోడ్ కి వచ్చేసి అక్కడ నుండి గదౌలియా క్రాస్ రోడ్స్ కి, అక్కడ నుండి గిరిజా ఘర్ సర్కిల్ కి వెళ్ళాలి. ఇవి చాలా ప్రసిద్ధమైన ప్రదేశాలు. మీకు హిందీ రాకపోయినా కూడా కేవలం ఈ ప్రాంత పేరు చెప్తే చాలు స్థానికులు చేతుల సైగలతో అయిన ఎటుగా వెళ్ళాలో చెప్పేస్తారు. గిరిజా గర్ చౌరస్తాలో సూరజ్ కుండ్ అని అడిగితే సాధారణంగా ఎవరైనా చెప్పేస్తారు. ఈ సూరజ్ కుండ్ దగ్గరలోనే ఉంది సాంబ ఆదిత్యుని ఆలయం.
ఈ సాంబ ఆదిత్యుని దర్శనం తరువాత ఉత్తరార్క ఆదిత్యుని గుడికి వెళ్ళండి. ఈయన గుడి వారణాసి సిటీ స్టేషన్ (జంక్షన్ స్టేషన్ కాదు) పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న సందులో నుండి వెళ్ళాలి. వారణాసి సిటీ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి బకరియా కుండ్ అని అడగాలి. ఈ ఉత్తరార్క ఆదిత్యుని ఆలయం ఈ బకరియ కుండ్ కి చాలా దగ్గరలో ఉంది.
ఈ ఉత్తరార్క ఆదిత్యుని దర్శనం తరువాత కేశవ ఆదిత్యుడు దర్శనానికి వెళ్ళండి. ఈయన ఆది కేశవ్ ఘాట్ లో ఉన్న ఆది కేశవ్ మందిరంలో ఉన్నారు. గూగుల్ మ్యాప్స్ సహాయంతో గుడికి చేరుకోవడం చాలా సులభం. గుడిలో కూడా ఆది కేశవుని విగ్రహం ప్రక్కనే కేశవ ఆదిత్యుడు ఉన్నారు.
ఈ కేశవ ఆదిత్యుని దర్శనం అనంతరం ఖఖోల్క ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. ఈ గుడి మత్స్యోదరి అనే ప్రాంతంలో ఉన్న బిర్లా హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న సందులో కామేశ్వర మహాదేవ్ గుడిలో ఉన్నారు. వీడియోలో చూపించినట్లు గుడి వెనకాల ఉన్న వరండాలో ఉన్నారు స్వామి వారు.
ఖఖోల్క ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడకి చాలా దగ్గరలో ఉన్న అరుణ ఆదిత్య దర్శనానికి వెళ్ళండి. ఈ అరుణ ఆదిత్య త్రిలోచన మహాదేవ్ మందిరంలో ఉన్నారు. వీడియోలో చూపినట్టు త్రిలోచన మహాదేవ్ గుడి వెనక వైపు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఉంది అరుణ ఆదిత్య మూర్తి.
తరువాత మయూఖ ఆదిత్యుని గుడికి వెళ్ళండి. ఘాట్ లో నుండి వెళ్తుంటే బాలాజీ ఘాట్ వరకు వెళ్ళండి. అక్కడ మెట్లు ఎక్కిన వెంటనే గుడి వస్తుంది. రోడ్డు మార్గంలో పంచగంగ ఘాట్ వరకు వెళ్ళాలి. కాల భైరవ గుడి వెనక నుండి వెళ్ళే దారి సాధారణంగా కొత్త వారు వెళ్ళే దారి. పంచగంగా ఘాట్ దగ్గరలో ఉన్న మంగళ గౌరీ ఆలయంలో ఉన్నారు మయూఖ ఆదిత్యుడు. ఈ మూర్తిని కనుక్కోవడం కొత్తవారికి కొంచెం కష్టం. ఈ గుడి మధ్యలో వున్న గభస్తీశ్వర లింగమునకు కుడి వైపు మూలలో ఉంటారు.
మయూఖ ఆదిత్యుని దర్శనం తరువాత యమ ఆదిత్యుని గుడికి వెళ్ళండి. పడవలో వెళ్ళేవారు సింధియా ఘాట్ లేదా సంకట ఘాట్ లో దిగితే ఘాట్ మెట్లు మీద ఉన్నారు.
తరువాత అక్కడకు దగ్గర్లోనే ఉన్న గంగా ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. ఈయన లలిత ఘాట్ లో వున్న నేపాలి మందిరం కింద భాగంలో ఉన్నారు. లలితా ఘాట్ నుండి నేపాలి మందిరం వరకు మెట్లు ఎక్కిన తరువాత మళ్ళీ గుడి ముందు కుడి చేతి వైపు ఉన్న చిన్న చిన్న మెట్లు దిగాలి. అక్కడ ఎడమ చేతి వైపు ఉంటారు ఈ గంగా ఆదిత్యుడు.
తరువాత దగ్గర్లో ఉన్న వృద్ధ ఆదిత్యుని గుడికి వెళ్ళండి. ఈ గుడి మీర్ ఘాట్ లో ఉంది. పడవలో వచ్చే వారు మీర్ ఘాట్ లో దిగి మెట్లు ఎక్కి విశాలాక్షి అమ్మ వారి గుడి వైపు వస్తుంటే ఎడమ చేతి వైపు ఉంటుంది ఆలయం. నడచి వచ్చే వారు కూడా లలిత ఘాట్ నుండి ఘాట్ మార్గంలో వస్తే సులభంగా చేరుకోవచ్చు. వృద్ధ ఆదిత్యుని దర్శనం తరువాత దగ్గరలోనే ఉన్న విశాలాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోండి.
తరువాత ద్రౌపది ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. విశ్వనాథ గుడి అభివృద్ధి పనులలో భాగంగా అసలైన ద్రౌపది ఆదిత్యుని విగ్రహం తొలగించేసారు. అందుకని ప్రతిగా మీరు అన్నపూర్ణ దేవి గుడి వెనకాల ఉన్న సూర్య నారాయణ మూర్తి దర్శనం చేసుకోవచ్చు. వృద్ధ ఆదిత్యుని దర్శనం తరువాత విశ్వనాథ కారిడార్ 2 లేదా 4వ నంబర్ గేటు నుండి కానీ అన్నపూర్ణ అమ్మవారి గుడికి వెళ్ళవచ్చు. అన్నపూర్ణ అమ్మవారు, ద్రుపద ఆదిత్య అంశ ఒక్కటే కాబట్టి అసలైన ద్రుపద ఆదిత్య విగ్రహం ప్రస్తుతం లుప్తంగా ఉంది కాబట్టి ఈ ఆదిత్యుని దర్శనంతో ద్వాదశ ఆదిత్యులు యాత్ర పూర్ణం చేసుకోండి. తరువాత అన్నపూర్ణ అమ్మను, విశ్వనాథ తండ్రిని దర్శించుకుంటే మీ యాత్ర పరిపూర్ణం.
Негізгі бет కాశీలో ద్వాదశ ఆదిత్యులు దర్శనం ఒక్క రోజులో చేసుకోవడం ఎలా?
Пікірлер: 82