గిర్మిట్ గురించి కార్యక్రమం చిత్రీకరణ హోస్పెట్ లో గుర్తింపు గల ఖాదర్ భాయ్ గిర్మిట్ బండి వద్ద జరిపాం.36 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం బండిని ప్రారంభించుకున్న ఖాదర్ భాయ్ గారు సాధారణ తయారీ కితోడు వైవిధ్యమైన ఆలోచనతో సొంత సూత్రం కనుగొని మరి కొన్ని ముడి పదార్థాలు అదనంగా జత పరిచి అందరికంటే భిన్న రుచితో అల్పాహారం అందిస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం వారి కుమారులు నిర్వహణ చూస్తున్నారు.
ఉత్తర కర్ణాటకలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఉపాహారం గిర్మిట్.మందక్కి ఉప్కారి,చురుమురి అనే కూడా అంటారు కొన్నిచోట్ల.సాయంత్ర వేళ ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు ప్రజలు.
తయారీకి ప్రధానం బొరుగులు కావడంతో చూడటానికి భేల్ పూరిని తలపిస్తుంది.ఆహారం రూపుదాలెందుకు కలపబడే జోడింపులు మరియు అంతిమ రుచి పూర్తి వ్యత్యాసం భేల్ పూరికి.
గిర్మిట్ చేసేందుకు 25రకాల పదార్థాలు వినియోగించారు ఈ బండి వద్ద.గమ్మత్తుగా ఉంది గిర్మిట్ తయారీ.కలగల్పడంలో ప్రావీణ్యత కనబరిచారు ఏవక్క పదార్ధ పాత్ర హెచ్చు కాకుండా.
బొరుగులు దగ్గర నుండి కిరా దోశ కాయ వరకు నాణ్యత పాటించి కారం, పులుపు, తీపి ముచ్చటగా మూడు రుచుల నేపధ్యాన్ని అమరిక చేశారు.ఈ అల్పాహారం నాకు చాలా బాగా నచ్చింది.చిత్రీకరణ అప్పుడే కాదు తర్వాత కూడా అనేక సార్లు తిన్నాను ఎంతో ఇష్టంగా.ఆహార పరంగా హోస్పెట్ పేరు వినగానే నాకు గుర్తొచ్చేది ఖాదర్ భాయ్ గిర్మిట్. మరలా చెబుతున్నాను నాకు బాగా బాగా నచ్చింది.
Негізгі бет Khadar Bhai Girmit | 36years Famous Girmit | 25 Ingredients Girmit | Hospet Food | Food Book
No video
Пікірлер: 22