#hithabodha #bibu #christianresponse
1. 4:04 - సహజాతీతమైన శక్తులనేవి యేసుక్రీస్తు ప్రభువువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఉన్నాయి కానీ ప్రస్తుత కాలంలో లేవు అని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నది వాక్యానుసారమేనా? వివరించగలరు.
2. 10:28 - 66 పుస్తకాలు మాత్రమే దేవుని వాక్యము అని అన్ని Denominations వారూ నమ్మరు. అటువంటప్పుడు మనం నమ్మే ఈ 66 పుస్తకాలే దేవుని వాక్యం అని నిర్ధారించుకోవడానికి అద్భుతాలు, సూచకక్రియలు ఈ రోజుల్లో కూడా అవసరమే కదా. దీని గురించి మీరేం అంటారు?
3. 14:02 - Benny Hinn అనే పాస్టర్ స్టేజి పైన చేసే అద్భుతాలు చూస్తే, అతను నిజంగానే చేస్తున్నాడు అని ఎవరైనా యిట్టె భ్రమపరచబడే అవకాశం ఉంటుంది. వాటి గురించి మీరేం అంటారు?
4. 17:22 - మా ప్రాంతంలో బైబిల్ మిషన్ కి సంబంధించిన 'దేవదాసు వధువు సంఘము' అనే చర్చ్ ఉంది. ఆ చర్చ్ పాస్టర్ గారికి మీ వీడియోలు పంపిస్తూ ఉంటాను. వాటి గురించి ఆయన ఒకసారి ఇలా అన్నారు - "వాడెవడో నాకు తెలియకుండా, వాడి వీడియోస్ నేనేందుకు చూస్తాను". ఇలా మాట్లాడటం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమయ్యుండొచ్చు? మాకన్నీ తెలుసు అనుకుంటారా లేక బైబిల్ మిషన్ ఏది బోధిస్తే అదే పరమసత్యం అని అనుకుంటారా? దీనిపై మీ స్పందన తెలియజేయగలరు.
5. 22:26 - ఆత్మసంబంధులకు శరీరసంబంధులకు తేడా ఏంటో తెలియజేయగలరు.
6. 26:57 - అబ్రాహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడి వారికి భయపడి శారా తన చెల్లెలు అని చెప్తాడు. ఆ తరువాత ఆది 20:12లో ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని ఆమె నా తల్లి కుమార్తె కాదు, ఆమె నా భార్య ఆయెను అని అంటాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
7. 31:59 - బైబిల్ ప్రకారం Dinosaurs ఏ కాలంలో జీవించేవో చెప్పగలరా?
8. 35:52 - కీర్తన 103:5లో "పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు" అని ఉంటుంది. దీని గురించి వివరించగలరు.
9. 39:36 - పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకొస్తు పండుగ, శృంగధ్వని దినము మరియు విశ్రాంతి దినము వంటి వాటిని పాటించమని బైబిల్ లో స్పష్టంగా రాయబడి ఉంది. కానీ క్రైస్తవులుగా పిలువబడే మనం ఎందుకు వాటిని ఆచరించడం లేదు?
10. 44:14 - పాస్టర్ గారు ఒకవేళ ఏదైనా పాపం చేస్తే, అతను తిరిగి ఎలా సమకూర్చబడగలడు? పాస్టర్ నిందారహితుడుగా ఉండాలి అనే అర్హతను ఇలాంటి పరిస్థితులకు ఎలా అన్వయించవచ్చు? లేఖనాధారాలతో వివరించగలరు.
11. 51:36 - బైబిల్ ముందా? హిందూ గ్రంథాలు ముందా?
12. 56:12 - యేసు క్రీస్తుకు సంబంధించిన పురావస్తుశాస్త్ర సంబంధమైన ఆధారాలేవైనా ఉన్నాయా?
13. 1:05:35 - "నిజంగా ఒక వ్యక్తి దేశాన్ని ప్రేమిస్తే వాళ్లు 'భరత్ మాతాకీ జై' అని అంటారు" అని కొన్ని గుంపులవారు అంటూ ఉంటారు. ఇలా సంబోధించడం ఒక క్రైస్తవుడికి నిషిద్ధమే కదా? తెలియజేయగలరు.
14. 1:09:37 - రోమా 8:26లో "ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు" అని ఉంటుంది. ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
15. 1:11:01 - మెల్కీసెదెకు గురించి వివరించగలరు.
16. 1:12:06 - ఒక బిడ్డ జన్మించిన తరువాత చెయ్యాల్సిన శుద్ధీకరణ ఆచారాల గురించి లేవియకాండము 12లో చదువుతున్నాము. ఇటీవల నా భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అనేక ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాలని ఇంట్లోవారూ, బంధువులూ మాపైన వాటిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మేమేం చెయ్యాలో సూచించగలరు.
17. 1:15:03 - కొన్ని మీటింగ్స్ లో పాస్టర్స్ "దేవుడు నాకు చూపించాడు" అని కొందరిని పేర్లు పెట్టి స్టేజి మీదకి పిలిచి, వాళ్లకు ఉన్న సమస్యని చెప్పి, దానికోసం ప్రార్థించి, ప్రవచించి, అవి తీరిపోతాయి అంటున్నారు. వాళ్లని నమ్మొచ్చా? అసలు అలాంటివారిని రక్షించబడినవారిగా పరిగణించవచ్చా?
18. 1:17:27 - ఆదిమానవుల ప్రారంభం బైబిల్ ప్రకారం 6000సం. క్రితం జరిగింది కానీ కొన్ని అవశేషాలు దొరికినపుడు మనిషి ఆవిర్భావం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్తారు. దీన్ని ఎలా చూడాలి?
19. 1:18:10 - 1 కొరింథీ 6:19లో మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అని ఉంటుంది. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కదా నివసించేది? మరి 'దేహము పరిశుద్ధాత్మకు ఆలయము' అనే మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
20. 1:20:54 - ధర్మశాస్త్రంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, యోహాను 13:34లో మరల ఒకరినొకరు ప్రేమింపవలెనని కొత్త ఆజ్ఞ ఇవ్వడం ఏమిటి?
Негізгі бет క్రైస్తవ స్పందన (Christian response) EP - 87 (25 June 2024 @8:00 PM) | hithabodha
Пікірлер: 6