1. 3:26 - నేను తప్పు చేస్తే కోర్టు నాకు మాత్రమే శిక్ష విధిస్తుందా? లేక నా మనవళ్ళు, మనవరాళ్లకు కూడా శిక్ష విధిస్తుందా? ఆదాము చేసిన తప్పును బట్టి ఇంకా ఎంతమంది శిక్ష అనుభవించాలి?
2. 7:25 - దేవుడు ఆదామును సృష్టించిన తరువాత అతను ఒంటరిగా ఉండటం సరికాదని గుర్తించి, హవ్వను సృష్టించాడా?
3. 9:00 - కొన్ని Text booksలో హైందవ దేవుళ్ళ గురించి మన క్రిస్టియన్ పిల్లలు కూడా చదవాల్సి వస్తుంది. మనం కూడా అలా చెయ్యొచ్చు అని విజయ్ ప్రసాద్ రెడ్డి గారు తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి?
4. 12:03 - సేవకి దేవుడు పిలుచుకుంటున్నాడు అని మనం ఎలా నిర్ధారించుకోవాలి?
5. 14:02 - దేవుడు మనతో వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడతాడా లేక కలలు, దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడా?
6. 18:01 - ఈ మధ్య కొంత మంది క్రిస్టియానిటీని మతోన్మాదులకు వ్యతిరేకంగా ఐక్యం చెయ్యాలి అని అంటున్నారు. సిద్ధాంతపరంగా అనేక విభేదాలు ఉన్నవారు ఐక్యమవ్వడం ఎలా సాధ్యం?
7. 24:40 - మాలో శైవం అనీ, వైష్ణవం అనీ, చాలా వర్గాలు ఉన్నాయనీ మమ్మల్ని తప్పు పడుతుంటారు. కానీ మీ మతంలో కూడా ఐక్యత లేదు కదా అని లలిత్ కుమార్ కొన్ని రోజుల క్రితం సవాలు చేశాడు. మీరేం ఏమంటారు?
8. 27:07 - అపొ.కార్య. 17:30లో "ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు" అని ఉంటుంది. ఈ వచనాన్ని వివరించగలరు.
9. 30:35 - యోహాను 3:16 లాంటి అనేక వాక్యభాగాలు యేసు ప్రభువు అందరి కోసం చనిపోయాడు అన్నట్లు చెబుతున్నాయి కానీ మీరు దేవుడు కొందరినే ఎన్నుకున్నాడు అంటున్నారు. ఎందుకని?
10. 32:46 - సంఘము శ్రమల కాలంలో ఉంటుందా లేక ముందే ఎత్తబడుతుందా? వివరించగలరు.
11. 34:08 - క్రైస్తవ యవ్వనస్థులు వేరే Denominations నుండి వచ్చినవారిని వివాహం చేసుకున్నప్పుడు వారి మధ్యనున్న సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా భవిష్యత్తులో ఆ కుటుంబంలోనివారు సంతోషంగా కలిసి జీవించలేకపోతున్నారు. ఇటువంటివాటితో ఎలా వ్యవహరించాలి?
12. 37:10 - ఒక వ్యక్తి తన Career విషయంలో ఏదైతే కోరుకున్నాడో అది కాకుండా వేరు వేరు కారణాల వల్ల వేరే చదువు చదవాల్సొచ్చింది. చదువుకు తగిన careerలోనే ముందుకు పోవాల్సొచ్చింది. కానీ success అవ్వడం, సర్దుకుపోవడం కష్టంగా అనిపిస్తుంది. ఈ విషయంలో సహాయం చెయ్యమని దేవుణ్ణి ఏమని అడగాలి?
13. 40:08 - యేసు కొత్త నిబంధనలో యెహోవా పేరు ఎందుకు ప్రస్తావించలేదు?
14. 42:33 - పాత నిబంధనలో దేవుడు ఆహారానికి సంబంధించిన కొన్ని నియమాలు ఇచ్చాడు. కానీ అపొ.కార్య. 10లో దేవుడు పేతురుని నిషిద్ధమైనవాటిని తినమని చెబుతున్నాడు. దేవుడు ఎందుకు మాట మారుస్తున్నాడు?
15. 48:41 - క్రైస్తవులు విగ్రహార్పితాలు తినవచ్చా?
16. 51:30 - క్రైస్తవులు కూడా యేసుప్రభువు విగ్రహాలు, మరియమ్మ విగ్రహాల దగ్గర పెట్టిన ప్రసాదాలు తినవచ్చా?
17. 53:34 - దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నా నామం ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు అని అంటాడు కదా. మరి ఆదాము, హవ్వ, అబ్రాహాములకి యెహోవా నామం తెలియదు అని అనుకోవచ్చా?
18. 58:00 - హిందువులు వాళ్ళ దేవుళ్ళకి ఆధారాలు వున్నాయి అంటున్నారు. అది నిజమేనా? సంస్కృత భాషకి అసలు లిపి లేదా?
19. 58:41 - పాస్టర్లు ఒకరిపై ఒకరు సిద్ధాంతరీత్యా పరస్పర వాదనలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు యూట్యూబ్ లో కౌంటర్ ఎటాక్ లు పెట్టడం మంచిదేనా?
20. 1:02:07 - దేవుని సార్వభౌమత్వంలో నాశనపుత్రుల మీద ఆయన ఉగ్రత నిలిచి ఉన్నట్లైతే, సువార్త ప్రకటించడంలో భాగంగా 'దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు' అని ఎదుటి వ్యక్తికి చెప్పొచ్చా?
21. 1:04:24 - యోహాను 4:16ని ఆధారం చేసుకొని 'ప్రతి మతం దేవుణ్ణి చేరుకోగలిగే మార్గమే' అని ఇటీవల పోపు చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? కాథలిక్స్ ఎవరికి కట్టుబడి ఉండాలి? బైబిలుకా లేక పోపుకా?
22. 1:06:46 - దేవుడు భూమి పునాదులు వేయక ముందు నుండే తన రక్షణ ప్రణాళికలో లేనివారిని ఎందుకు ద్వేషిస్తున్నాడు? నేను కూడా ఆ గుంపులోనే ఉన్నట్లు అయితే నా పరిస్థితి ఏంటి? వివరించగలరు.
23. 1:08:07 - Reformed Teaching ప్రధానంగా చేసే బోధ ఏంటి?
24. 1:09:51 - ఒక వ్యక్తి ఒకసారి పెళ్లి బాప్తిస్మం తీసుకొని, తర్వాత రక్షణ పొందితే ఆ వ్యక్తి మరలా బాప్తిస్మం తీసుకోవాలా?
25. 1:10:34 - మన భారతదేశానికి క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు వచ్చింది?
26. 1:11:53 - క్రీస్తు గురించి చారిత్రాత్మక, పురావస్తు శాఖ ఆధారాలేవైనా చెప్పగలరా?
27. 1:12:58 - అన్యభాషల గురించి తెలియజేయండి.
28. 1:14:38 - కొందరు పాస్టర్లు మనకు దేవుని ప్రేమ సరిపోతుంది, ఇతరుల నుండి ప్రేమ ఆశించవద్దు అని బోధిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు?
29. 1:16:17 - యోబు గ్రంథం రచయిత & కాలం వివరించండి.
30. 1:16:43 - హైందవ సహోదరుడు అడిగిన ప్రశ్న - మా ప్రసాదం మీరు తినరు కదా. కానీ చాలా హోటల్లో ప్రసాదం కొబ్బరిచిప్పలతోటే చట్నీలు చేస్తుంటారు'. దీనికి మీరేం చెబుతారు?
31. 1:17:40 - శత్రువులను ప్రేమించాలి అని బైబిలు చెప్తుంది. మరి తరచూ మనల్ని బాధపెడుతూ మోసం చేసే మన ఫ్యామిలీ మెంబర్స్ (ఉదాహణకి అత్త, ఆడపడుచు వంటివారు) తో మనం ఎలా వ్యవహరించాలి?
32. 1:18:44 - బైబిల్లో ఒక రాజు వయస్సు ఒక చోట 8 సంవత్సరాలనీ, మరో చోట 18 సంవత్సరాలనీ ఉంది. ఇలా ఉండటం పరస్పర వైరుధ్యం కదా?
33. 1:20:43 - క్రైస్తవ పిల్లలు లోకానుసారంగా ఉండే సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్స్ చెయ్యడం వంటివి చేస్తున్నప్పుడు, వారిని ఎలా educate చెయ్యాలి?
34. 1:21:51 - బిబు గారు, మీరు Debatesలో ఎందుకు పాల్గొనట్లేదు?
35. 1:23:58 - దేవుడు చెప్పిన అంత్యకాల సూచనలు & ఇప్పుడు జరుగుతున్న సంఘటనలపై ఒక సిరీస్ చేస్తే అది రాకడ కోసం అందరూ సమాయత్తం కావడానికి ఉపయోగపడుతుంది. ఏమంటారు?
36. 1:24:52 - 100th episode ఎలా ఉండబోతుంది?
Q & A Session
On 17 - 09 - 2024
Негізгі бет క్రైస్తవ స్పందన Ep - 99 (Christian response)
Пікірлер