SONG NO - 223(753)
"అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును" ఆదికాండము Genesis 15:1
"నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను." కీర్తన Psalm 89:34
"ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు." దానియేలు Daniel 7:14
పల్లవి: కృపాతిశయముల్ ఓ నా యెహోవా - నిత్యమున్ కీర్తింతును
తరతరములకు నీ విశ్వాస్యతన్ - తెలియ జేసెదను
1. యెహోవా వాక్కు దర్శనమందు - అబ్రామునకు వచ్చెను
అబ్రామా భయపడకు - 2
నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను - 2
2. నా నిబంధనన్ ఏ నాటికిన్
రద్దుపరచనని పల్కెన్ - మార్చవు నీ మాటను
నీ పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు
3. శాశ్వతమైనదా ప్రభుత్వము - తొలగిపోదే నాటికిన్
లయము కాదు ఆ రాజ్యం
మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము
4. నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి
ఆకాశ తారల వలెన్
సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి
5. దివారాత్రులతో నా నిబంధన
మార్చెదరా మీరు మీరునట్లు - అట్లయిన భంగమగున్
దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి
6. సింహాసనమున దావీదు - సంతతి యుండక మానదు
లేవీయుల్ యాజకులన్
నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి
7. యెహోవా నీ కృప కార్యములన్నియు
వీనుల విందుగ నొప్పుచుండె
శ్లాఘింతున్ మనసారగన్
హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము
Негізгі бет KrupaatiSayamul O Naa Yehovaa || Songs Of Zion || Song No 223(754)
Пікірлер: 6