#lalithachalisa #lalithadevi #devotional #geethanjali
Watch and learn the Lalitha Chalisa in Telugu, a powerful prayer to Goddess Lalitha Devi. Connect with the divine and experience the blessings of Lord Lalitha Devi!
** Song Credits **
లలితా చాలీసా
రాగం : మోహన తాళం : ఏక తాళం శృతి : 1 ( C )
1. లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం
2. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం
3. పద్మరేకులకాంతులతో బాలాత్రిపుర సుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి
4. శ్వేత వస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి
5. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు
6. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు
7. శ్రీ చక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరిసంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగ రావమ్మా
8. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి ॥ లలితామాతా ॥
9. పసిడి వన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో
పారిజాతపు మాలలో పార్వతిదేవిగ వచ్చితివి
10. రక్త వస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్త బీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు
11. కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతాకాపాడ కనకదుర్గవై వెలసితివి
12. రామలింగేశ్వరు రాణివిగా రవికులసోముని రమణివిగా
రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు
13. ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా
14. మహామంత్రాధిదేవతగ లలితాత్రిపురసుందరిగ
దారిద్య్రబాధలు తొలగించి పరమానందము కలింగించే
15. ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకర పూజితవే అపర్ణాదేవిరావమ్మ
16. విష్ణుపాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నినుకొలువ భూలోకానికివచ్చితివి ॥ లలితామాతా ॥
17. ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరము దాల్చితివి
ఆది ప్రకృతిరూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ
18. దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశపీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ
19. శంఖ చక్రము ధరియించి రాక్షససంహారము చేసి
లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు
20. పరాభట్టారిక దేవతగ పరమశాంత స్వరూపిణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరియించితివి
21. పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే
22. సురులు అసురులు అందరునుశిరసును వంచి మ్రొక్కంగ
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి
23. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై
అంకుశాయుధధారిణిగా భాసిల్లెను శ్రీజగదంబ
24. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగ వచ్చితివి ॥ లలితామాతా ॥
25. మహామేరువు నిలయినివి మందార కుసుమ మాలలతో
మునులందరు నినుకొలువంగా మోక్షమార్గము చూపితివి
26. చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే
27. అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం
28. అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూన రావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మా
29. నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు
30.రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి
31. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి
32. గిరిరాజునికి పుత్రికగ నందనందుని సోదరిగ
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి ॥ లలితామాతా ॥
33. పరమేశ్వరునికి ప్రియసతిగ జగమంతటికి మాతవుగ
అందరి సేవలు అందుకొని అంతటనీవే నిండితివి
34. కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టము తీర్చమ్మా
35. ఏవిధముగ నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు
36. మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనుసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి
37. త్రిమాతృరూపా లలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా
38. ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము
39.సదాచార సంపన్నవుగా సామగానప్రియ లోలినివి
సదాశివుని కుటుంబిణివి సౌభాగ్యమిచ్చే దేవతవు
40. మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము ॥ లలితామాతా ॥
*End Song Details*
lalitha chalisa in telugu
lalitha chalisa with lyrics
lalitha chalisa with telugu lyrics
sri lalitha chalisa telugu lo
sri lalitha chalisa in telugu
sri lalitha chalisa with lyrics
sri lalitha chalisa in telugu lyrics
sri lalitha chalisa with telugu lyrics
sri lalitha chalisa only lyrics in telugu
sri lalitha chalisa in telugu with lyrics
#bhakti #bhagwan #bhaktisong #geethanjali #bhakisong2024 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #singwithme #singwithus #telugsdevotionalsongs2024 #geethanjali #durgadevi #durgadevitelugusongs #aadilakshmimeditations #lalithadevi
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: facebook.com/profile.php?...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Негізгі бет Learn లలితా చాలీసా | Transform Your Life with Lalitha Chalisa Lyrics
Пікірлер: 44