Library man who purchased books | Lanka Suryanarayana Latest Interview #3 | #vijayanthi #library పుస్తకాలంటే
#LankaSuryaNarayana #LibraryMan
ఆయనకు తగని మక్కువ. ఏడాదికి లక్ష రూపాయల విలువైన పుస్తకాలను కొనేవారు. ఇంట్లో అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టేవారు. వంటగదిలో సైతం పుస్తకాలే. ఇంట్లో కిటికీ అనేది కనిపించేది కాదు. పడుకోవాలంటే చోటు చేసుకోవాల్సి వచ్చేది. ఆ ఇంటిల్లిపాదికీ పుస్తకం అంటే అంత మక్కువ. ఆ వీధికి ఆయన వెలగా వెంకటప్పయ్య గారి పేరు పెట్టుకున్నారు. కస్టమ్స్ అండ్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన లంక సూర్యనారాయణ గారు ఈ గ్రంధాలయ సృష్టికర్త. 2500 రామాయణాలు, ఆరు వేల బయోగ్రఫీలు, తాళపత్ర గ్రంధాలు, భగవద్గీత.. ప్రత్యేకంగా ఉన్నాయి.
ఆ లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతించరు. దీనికి కారణం లైబ్రరీ వ్యవస్థాపకుడి స్వీయానుభవమే. ఆయన ఇంటి నుంచి పట్టుకెళ్లిన పుస్తకాలు రెండు సందర్భాలలో వెనక్కి రాలేదట. అప్పటి నుంచి ఆయన నిర్ణయం మార్చుకున్నారు. బయటకు ఇవ్వడం మానుకున్నారు. ఇరవై ఐదు సంవత్సరాలపాటు ఏటా లక్ష రూపాయలు ఖర్చు చేసి పుస్తకాలు కొన్నారు. వెలగా వెంకటప్పయ్యగారు లంక సూర్యనారాయణ గారి నిబద్ధతను అనేక సందర్భాలలో పేర్కొన్నారు కూడా. సూర్యనారాయణ గారిని అజోవిభో ప్రతిభామూర్తి పురస్కారంతో పాటు అనేక అవార్డులు వరించాయి. ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణ ఆయనను గ్రంధాళ్వార్ గా సంబోధిస్తారు.
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...
Негізгі бет Library man who purchased books | Lanka Suryanarayana Latest Interview #3 |
Пікірлер: 9