చిత్రం:శ్రీవారికి ప్రేమలేఖ (1984)
రచన : వేటూరి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
పల్లవి :
లిపిలేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ
నీ లేఖనీ ప్రణయలేఖని
బదులైన లేని లేఖ
బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ
నా లేఖనీ ప్రణయలేఖని
లిపిలేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ
అమావాస్య నిశిలో
కోటి తారలున్న ఆకాశం
వెలుగుతూ ఉంది వేదన తానై
విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా
వెలగలేని ఆకాశం... ఊ...
ఎదుగుతూ ఉంది వెన్నెల తానై
ఒక్కనాటి పున్నమి కోసం
లిపిలేని కంటి బాస
తెలిసింది చిలిపి ఆశ
అక్షరాల నీడలలో
నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో
నీ పెదవులు అద్దుకుని
నీకంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ
వేసుకున్నాను
ఘడియైన నీవు లేక
గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ
బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ
నా లేఖనీ ప్రణయలేఖని
లిపిలేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ
This video uploaded without any commercial intention or monetary benefits
Thank you for watching my dear friends ---
Yours Kumudini Devi
Негізгі бет లిపిలేని కంటి బాస తెలుగు లిరిక్స్ ❤️ Lipi Leni Kanti Basa Telugu Lyrics
Пікірлер: 9