విష్ణు సహస్రనామము ప్రకారము "సవితా" అనగా "సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు". సవితా మహర్షి సాక్షాత్తు ఆ విష్ణువు అవతారమే. శ్రీమద్భాగవతం ప్రకారం సవితా అనగా సకల జగత్తుని సృష్టించి రక్షించు వాడు అని అర్ధం...
సవిత మహర్షి సామవేదం సృష్టికర్త, వేదమాత గాయత్రి దేవి సవిత మహర్షి కుమార్తె..
సవిత మహర్షి వేదకాలం నాటి సోమ బ్రహ్మ రాజుకు, రామవర్మ బ్రహ్మకు ఆయుష్కర్మ చేసి యజ్ఞోపవితాన్ని ధరింప చేశాడని పురాణగాథ కూడా ఉంది. బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్న సవితా మహర్షి హిందూ మతం యొక్క పవిత్రమైన చతుర్వేదాలలో ఒకటైన సామవేదాన్ని రచించాడు. సవితా మహర్షి కుమార్తె గాయత్రీదేవి మంత్రాలలో సావిత్రి అనే పదం ప్రముఖంగా కనిపిస్తుంది. సవితా మహర్షి జననం సంస్కృత గ్రంథం "నాభిక్" పురాణంలో లిఖించబడి ఉన్నది అలాగే "కుమార సంభవ" అనే పవిత్ర గ్రంథంలో కూడా సవిత మహర్షి ప్రస్తావన ఉన్నది...
సవితా మహర్షి జయంతి మాఘ శుద్ధ సప్తమి అనగా రధసప్తమి రోజున జరుపుకుంటారు. సూర్యారాధనకు ఒక ప్రత్యేక దినం. ఈ రథసప్తమి సంవత్సరం కాలానుగుణమైన పండుగ, సూర్యభగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం, ఈ రోజు సూర్యనారాయణ ఆరాధకులు సవితా మహర్షి ఉపాసన చేస్తారు. ఈ ఉపాసన చేయడం ద్వారా బ్రాహ్మజ్ఞానం లభిస్తుంది అని భక్తుల నమ్మకం.
సవిత మహర్షి పీఠం కర్ణాటకలో అనేక ప్రాంతాలలో ఉన్నది, ప్రతి సంవత్సరం సవిత మహర్షి జయంతి భక్తుల సమక్షంలో అంగరంగవైభవంగా జరుపుతారు..
ఓం సవిత్రే నమః
#SavithaMaharshi #SavithaSamaj #Samaveda
Негізгі бет మహర్షి సవిత | savitha maharshi | savitha samaj |
Пікірлер