#vedamargham
mesha rasi ashwini nakshatra second pada temple for navagraha shanti
mesha rasi ashwini nakshatra second pada temple to solve problems
మేషరాశికి చెందిన , అశ్విని నక్షత్రం రెండొవ పాదము వారి యొక్క దేవాలయము
అందరికి నమస్కారం
వేదమార్గం లో క్షేత్ర దర్శనం కి స్వాగతం
భీమేశ్వర పురాణం లో తొమ్మిదో అధ్యాయం లో చెప్పిన విధంగా , శ్రీ దక్షారామ క్షేత్రమును కేంద్రంగా చేసుకుని , శ్రీ దక్షారామ క్షేత్రం లో ఉన్న భీమసభ ప్రామాణికంగా, పద్మాకారంలో ప్రతి రాశి వారికి ,
ప్రతి నక్షత్ర పాదం వారికి దేవాలయములు కొలువై ఉన్నాయి.
ఇవి అన్నియూ ఎంతో పురాతన , మహిమాన్వితమై పచ్చని గోదావరి నదీ తీర పరిసర ప్రశాంతమైన ప్రదేశములలో ఉన్నాయి.
సిద్ద క్షేత్రములు హంగులు , ఆర్భాటములకు దూరంగా ఉంటాయి.
దైవమును నమ్మి చెడిన వారు లేరు. ఆ భోళా శంకరుడు అభిషేక ప్రియుడు , చెంబుడు నీళ్లతో అభిషేకం నిజమైన భక్తితో చేస్తే కోరిన కోర్కెలను కాదనకుండా తీర్చే అపర భక్త సులభుడు.
ఇప్పుడు మనం మేషరాశికి చెందిన , అశ్విని నక్షత్రం రెండొవ పాదము వారి యొక్క దేవాలయము గురించి తెలుసుకుందాం.
ఈ పురాతన మహిమాన్విత దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో , తూర్పుగోదావరి జిల్లాలో కాజులూరు మండలంలో ఉప్పుమిల్లి అనే గ్రామం లో కలదు.
ఈ ఆలయం అత్యంత ప్రశాంత మైన వాతావరణంలో , పచ్చని పంట పొలముల మధ్య కలదు.
ఈశ్వరుడు ఈ క్షేత్రం లో శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భవానీ శంకరుడు గా భక్తులను అనుగ్రహిస్తున్నారు.
మీ జాతకంలో ఎటువంటి దశ , అంతర్దశ నడుస్తూ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా మీ నక్షత్ర పాద క్షేత్రమును , రాశి క్షేత్రమును , శ్రీ దక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి , అభిషేకించి మీ యొక్క కోరికలను నిరవేర్చుకుంటారని ఆశిస్తున్నాం.
గమనిక :
ఒకేరోజులో మీ నక్షత్ర పాద క్షేత్రమును , రాశి క్షేత్రమును (మేష రాశి క్షేత్రము : విలాస గంగ వరం శ్రీ పార్వతి సమేత శ్రీ గంగాధరేశ్వరుడు ), శ్రీ దక్షారామ
శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి , అభిషేకించి న యడల మరింత ఫలప్రదము.
మీరు ఈ ఉప్పుమిల్లి క్షేత్రం లో అభిషేక , జప , దాన , హోమ క్రతువులు జరిపించు కోవటానికి దేవాలయ అర్చకులను సంప్రదించండి.
బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకట చంద్రశేఖర శర్మ గారు
Contact :9652321135
మరిన్ని వివరాలకు మీ కార్యక్రమాలు అన్ని సక్రమంగా నిర్వహించు కోవడానికి , జాతక చక్రం, ముహూర్త నిర్ణయం , జాతక పరిశీలన, అభిషేక , వ్రత, జప , దాన , హోమ క్రతువులు జరిపించు కోవటానికి ఈ క్రింది వారిని
సంప్రదించ గలరు :
వేదమార్గం
బ్రహ్మశ్రీ విల్లూరి వీరభద్ర రావు గారు
Contact: 9491577066
చేరుకునే మార్గం :
goo.gl/maps/TYm1nXgJV3nHBEDa7
ఒకేరోజులో మీ నక్షత్ర పాద క్షేత్రమును , రాశి క్షేత్రమును ,
శ్రీ దక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించు కోవాలి కాబట్టి
1.మొదట రామచంద్రపురం చేరుకోవాలి
2.ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతముల నుండి రామచంద్రపురం కు బస్సు సర్వీస్ కలదు.
3. రామచంద్రపురం నుండి ఉప్పుమిల్లి పదిహేడు కిలోమీటర్ల దూరంలో కలదు.
3.రామచంద్రపురం రైల్వే మార్గం లేదు. దగ్గర్లో సామర్లకోట లేదా కాకినాడ స్టేషన్ చేరుకోవాలి.
4.ఒకటి రెండు రోజులు ఉండాలి అనుకుంటే రామచంద్రపురం లో మాత్రమే మీకు రూమ్స్ దొరుకుతాయి.
5. ఉప్పుమిల్లి కి వెళ్ళడానికి మీరు సొంత వాహనం కానీ లేదా రామచంద్రపురం నుండి బస్సు సర్వీస్ లేదా ప్రైవేట్ వాహనంలో వెళ్ళ వచ్చు.
Негізгі бет mesha rasi ashwini nakshatra second pada temple for navagraha shanti
Пікірлер