కృష్ణా జలాల్లో రాష్ట్రానికి చట్టబద్ధమైన వాటా దక్కాలన్న నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, అధికారులకు స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు, కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని తెలిపారు. నీటిపారుదలశాఖకు సంబంధించి సుప్రీంకోర్టు, ట్రైబ్యునళ్లలో ఉన్న అంశాలపై మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్ రావు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు. కృష్ణా నదీ జలవివాదాల రెండో ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో ఉన్న వివిధ అంశాల పరిస్థితి, ముందుకెళ్లాల్సిన మార్గాలను సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరించారు. 2015లో ఏపీతో కృష్ణా జలాల విషయంలో కేవలం ఆ ఏడాదికి మాత్రమే అడ్ హక్ పద్ధతిన అంగీకారం కుదిరినట్లు చెప్పారు. కృష్ణా జలాల్లో తగిన వాటా కోసం ట్రైబ్యునల్ ముందు ప్రయత్నించాలని... తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాల్లో 50:50 వాటా కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని మరోమారు స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఈ విషయంలో శాసనసభలోనే తీర్మానం చేసినట్లు తెలిపారు. కృష్ణా జలాల వాటా, ప్రజల ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు ముందున్న ట్రైబ్యునల్ అవార్డు అంశాన్ని... మహారాష్ట్ర, కర్నాటకతో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మేలని వైద్యనాథన్ సూచించారు. ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి... మహారాష్ట్ర, కర్నాటకతో చర్చల ద్వారా పరిష్కారానికి అనుమతి ఇచ్చారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZitem Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет Minister Uttam Review On Irrigation Department Aspects | నీటిపారుదలశాఖ అంశాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
Пікірлер