WISH YOU AND YOUR FAMILY MEMBERS A VERY HAPPY VIJAYADASAMI 💐
🌺🍃 ----------------🍃 🌺
అన్నమయ్య వాణి నా సంకీర్తనా బాణి - 208
( ఛందోరీతి -- ద్విరదగతి రగడ )
🌺🍃 ----------------🍃 🌺
కీర్తన ః-- // దాసోహమను బుద్ధె తగునైన విజయంబు..//
🌹🌹
దాసోహమను బుద్ధె తగునైన విజయంబు
వాసుదేవుని గోరు వారలదె విజయంబు
卐 --🌹 -- 卐 // దాసోహమను .. //
ఆసలుడిగినవాని యానందమె విజయము
వాసమందే హరిని బ్రార్ధించుట విజయము
కూసంత జ్ఞానమును గోరుకొనుటె విజయము,
శ్రీసతీశుని జేరు చింతనొకటె విజయము
卐 --🌹 -- 卐 // దాసోహమను .. //
పంచేంద్రియముల వలఁ బడకుండుటె విజయము
సంచితముగా పుణ్య సముపార్జనె విజయము
మంచితన మెప్పుడును మదినుంచుట విజయము
యెంచగా సమబుద్ధె యిందరికిని విజయము
卐 --🌹 -- 卐 // దాసోహమను .. //
నిత్యపూజలు జేయు నిరతియున్న విజయము
సత్యమేదో తెలుపు సన్మార్గమె విజయము ,
ఇత్యమిల దైవకృప యీ భావమె విజయము
ప్రత్యక్ష దైవమును ప్రణుతించుటె విజయము
卐 --🌹 -- 卐 // దాసోహమను .. //
✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది ( స్వీయ రచన )
🌹🙏🌹🙏🌹🙏🌹
( స్వామీ !
నిజమైన విజయమనగా నేదో తెలుసుకుంటిని !
ఆ విజయమునందుకొనుటకు నాకు ,
సదా సహకరించుము తండ్రీ !! )🙏🙏
🌹🌹
Негізгі бет MY OWN SANKEERTANA / DASOHAMUNU BUDDHE / దాసోహమను బుద్ధె /COMP BY Smt B.CHINNAMA DEVI / Mohana
Пікірлер: 13