నీతీకై నిలబడితే
పల్లవి:-
నీతికై నిలబడితే నేరం మోపారె
నిజాయితీ చూపిస్తే నిందలు వేసారే,
అన్యాయం ఆపబోతే నాతో ఒకరు రారే
అవమానం ఎదురైతే అండ ఎవరు లేరే,
సత్యం ఎరిగిన నీవు నాతో ఉన్నావు
నీతి సుర్యుడా నను ఏరిగియున్నవు
చరణం-1
సూటి పోటీ మాటలతో గాయాలు చేశారే,
పగతో కళహలు రేపి ప్రేమను చల్లార్చరే,
చేసిన మేలుకు ప్రతిగా కీడే చేస్తున్నారే, మానవతా మంటగలిపి కక్షలు రగిలిచారే,
"నెమ్మది కోల్పోయి నిరాశలో ఉన్నాను
నమ్మదగిన నావికుడా నీకై వేచి ఉన్నాను(2)"
"సత్యం ఎరిగిననీవు నాతో ఉన్నావు
నీతి సూర్యుడా నన్నేరిగియున్నావు(2)"
చరణం-2
కపట వేషాలతో వేదన కలిగించారే
ద్వేషం, మోసాలతో గుండెను మండించారే
నాశనమై పోతావని నన్ను నిందించరే
ఇబ్బందుల పలుచేసి భహుగా వేధించారే
"నెమ్మది కోల్పోయి నిరాశలో ఉన్నాను
దరిచేర్చను నానవను నికే ఆర్పించాను(2)"
"సత్యం ఎరిగిననీవు నాతో ఉన్నావు
నీతి సూర్యుడా నన్నేరిగియున్నావు(2)
Негізгі бет నీతికై నిలబడితే
Пікірлер: 27