కొట్టుకున్నా చిన్నపిల్లలు తరువాత కలిసి ఆడుకుంటారు. కాని, పెద్దవాళ్ళు మాటా మాటా పెంచుకుని, దూరమవుతారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. బాగా చదివి జ్ఞానాన్ని వంటపట్టించుకుంటే, పరీక్షల్లో విజయంసాధించి, భవిషత్ జీవితానికి పూల బాట అవుతుంది. అమ్మదివేనెప్పుడు అమృతంకన్నా గొప్పదే. మదిలోభక్తిభావం ఉండాలని, ఒకటిగా కలసి జీవించకుంటే, తాళి కట్టి ప్రయోజనం లేదని, కన్నోళ్లని కనిపెట్టుకుని చూడకుంటే, పుట్టుకవిలువ లేదని చెప్పడం సరైనదే. శ్రమజీవి నిజాయితీగా ఉండాలని, అలలా తాలెట్టుకుని నడవాలని చెప్పారు. ఇప్పుడు అవి కరువే. ఆవేశం, అహంకారం చంపుకుని, సేవా భావంతో దాహర్తుల, దాహం తీర్చమని, కదిలించె భావానికి అక్షర రూపమీవ్వ మనే మీ సూచన బాగుంది. పుస్తక పఠనం చేసేవారు, కవితలు వినే శ్రోతలు కరువయ్యారు. మీ రచనలకు ధన్యవాదములు.
@pachabottubhushanam
9 күн бұрын
వెంకటేశ్వర్లు గారు ఓపికతో రాసిన మీ వివరణాత్మక విశ్లేషణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్లు ఈ కాలంలో చదువరుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అలా చదివేవాళ్లు కరవైనారని ఇలా వీడియోలు చేస్తే ఇలాంటివి వినేవాళ్లు మరియు చూసేవాళ్లు కూడా లేకుండా పోయారని నిస్పహ చెందకుండా నేను కొన్ని మంచి మాటలను చెప్పాలనుకొని నా బాధ్యతను ఈ రూపేన నిర్వర్తిస్తున్నాను. వీటిని వెయ్యిలో ఒకరిద్దరు చూసినా విన్నా చాలు, నాకు అదే తృప్తి. చెడు వ్యాప్తి చెందినంత వేగంతో మంచిమాట వ్యాప్తి చెందదు. అయినా బాధలేదు. ఆశావహ దృక్పథంతో ప్రయత్నించడంలో తప్పులేదు. 🌿🙏🏽🌿
Пікірлер: 6