Written by Sri Prasanna Vitthala Dasaru (Pt. Vadirajacharya Karanam)
Composed and sung by Venugopal Khatavkar.
నరసింహ పాహి లక్ష్మీనరసింహ ॥ప॥
నరసింహ సుగుణ శుభాంగ
తరుణాదిత్యకోటిప్రభంగ, ఆహా
చరణము శరణన్న వారిని కరుణించి
పరమానందమునిచ్చే గుణగణపరిపూర్ణ ॥అ.ప॥
హేమకశిపు దుర్దమనుడై
హేమగర్భవరముతో ఉద్ధతుడై
కామమదమోహమాత్సర్యరతుడై
యమరుద్రరోషాగ్నిభీషకుడై , ఆహా
భూమిభూదేవుల భీతుల చేయగ
భీమదండోర్జిత భీకరుడయితివి ॥1॥
ప్రలయజలధిభీషఘోష
స్థూలస్తంభదలన అట్టహాసా
జ్వాలజాలోజ్జ్వలితఘోరవేషా
కాలరాత్రిభయానకరోషా, ఆహా
ఖలజనదహన దుర్మతధ్వాంతతాపన
భాలనేత్రుడవై విభాసిల్లు జ్వాలాగ్ని ।।2।।
చురచురచూపుతో చూసి
బిరబిర హిరణ్యకుని పట్టేసి
ధరకేసి జోరుగ విసిరేసి రు-
ధిరముతో కళ్ళాపిని వేసి, ఆహా
ఊరువులందు శరీరము చీల్చి సు-
ఘోర హారముగా ప్రేవులను ధరించిన ।।3।।
జయ జయ జయ నారసింహా
భయ-దురిత-దుర్గతిమృగసింహా
క్షయహీన జననహీన బ్రహ్మ
నయవంచకసంహారసింహా, ఆహా
త్రయీవిద్యప్రతిపాద్య బ్రహ్మరుద్రేంద్రాద్య
దయాలేశమును చూపి కరుణించి కరుణించు ॥4॥
కరుణావరుణాగారమహిమా తవ
చరణస్తవనము నేనెరుగ
సారహీనసంసారము పెరుగ
తరణము నాకసాధ్యతరముగా, ఆహా
ప్రేరణ చేసి పరాత్పర నరహరి
తరియించి ముక్తిని కరుణించు గగనగ ॥5॥
అహోబలనవనారసింహా
సాహో అప్పన్న సింహాద్రిసింహా
ఊహకందని శుభగిరిసింహా
గుహావాసి నింబాద్రినృసింహా, ఆహా
మహరోష తొరవినీరాశూర్పాలయావాస
మహిమను కొనియాడ జాడను తెలుపయ్యా ।।6।।
సిరిసంపద సురులకాధారా
ఉరుదోషహిరణ్యకోద్ధారా
వరప్రహ్లాదాభీష్టసుధారా
చరాచరప్రపంచాఖిలధారా, ఆహా
భీరుజనుల భూరిభయహారి నరహరి
వీర ప్రసన్నవిఠ్ఠల ఘోరచోరారి ॥7॥
narasimha paahi lakshminarasimha ..pa..
narasimha suguna shubhanga
tarunadityakotiprabhanga, aha
charanamu sharananna varini karuninchi
paramanandamunichche gunaganaparipurna ..a.pa..
hemakashipu durdamanudai
hemagarbhavaramuto uddhatudai
kamamadamohamatsaryaratudai
yamarudraroshagnibhishakudai , aha
bhumibhudevula bhitula cheyaga
bhimadandorjita bhikarudayitivi ..1..
pralayajaladhibhishaghosha
sthulastambhadalana attahasa
jvalajalojjvalitaghoravesha
kalaratribhayanakarosha, aha
khalajanadahana durmatadhvantatapana
bhalanetrudavai vibhasillu jvalagni ..2..
churachurachuputo chusi
birabira hiranyakuni pattesi
dharakesi joruga visiresi ru-
dhiramuto kallapini vesi, aha
uruvulandu shariramu chilchi su-
ghora haramuga prevulanu dharinchina ..3..
jaya jaya jaya narasimha
bhaya-durita-durgatimrigasimha
kshayahina jananahina brahma
nayavanchakasamharasimha, aha
trayividyapratipadya brahmarudrendradya
dayaleshamunu chupi karuninchi karuninchu ..4..
karunavarunagaramahima tava
charanastavanamu neneruga
sarahinasamsaramu peruga
taranamu nakasadhyataramuga, aha
prerana chesi paratpara narahari
tariyinchi muktini karuninchu gaganaga ..5..
ahobalanavanarasimha
saho appanna simhadrisimha
uhakandani shubhagirisimha
guhavasi nimbadrinrisimha, aha
maharosha toravinirashurpalayavasa
mahimanu koniyada jadanu telupayya ..6..
sirisampada surulakadhara
urudoshahiranyakoddhara
varaprahladabhishtasudhara
characharaprapanchakhiladhara, aha
bhirujanula bhuribhayahari narahari
vira prasannaviththala ghorachorari ..7..
.
.
Spotify:
open.spotify.c...
Prime music:
music.amazon.i...
Apple music:
/ daasoham
Негізгі бет Narasimha Pahi Lakshmi Narasimha | Telugu
Пікірлер: 62