narayanaya namo namo
nanatmane namo namo
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 58
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 58
( నారాయణాయ నమో..నమో...
నానాత్మనే నమో నమో ...)
🙏 ఓం నమో వేంకటేశాయ.🙏
అందరికీ శుభోదయం✍️ ---మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 58కి శుభ స్వాగతం
✍️ --- మీ వేణుగోపాల్.
నమామి నారాయణ పాద పంకజం,
వదామి నారాయణ నామనిర్మలం,
భజామి నారాయణ తత్త్వమవ్యయం,
కరోమి నారాయణ పూజనం సదా🙏🙏🙏✍️---- పోతన
భావము :--
🌹నారాయణుని పద్మములవంటి పాదములకు నమస్కరింతును. 🙏
🌹ఎల్లప్పుడూ నారాయణుని పూజ యొనరింతును.🙏
🌹నిర్మలమగు నారాయణ నామము ఉచ్చరింతును.🙏
🌹నాశరహితమగు నారాయణ స్వరూపమును ధ్యానింతును.🙏
పోతనామాత్యులు నారాయణుని నామస్మరణ గొప్పతనము వర్ణించి నట్లుగా , అన్నమయ్య కూడా నారాయణ నామ స్మరణము ఎల్లప్పుడూ భక్తి తో భజన చేయుటకు ఎన్నో సంకీర్తనలను మనకు ప్రీతిగా అందించారు .🙏
అట్టి మధురమైన భజన సంకీర్తన అర్ధము తెలుసుకుని , ఆ నారాయణుని భజన ను మనసారా చేద్దాము, తరించుదాము . 🙏🙏
🌺ఓ నారాయణా నీకు అనేక నమస్కారములు. 🙏🙏
🌺నానా విధములైన ఆత్మ స్వరూపము కలవాడా నీకు నమస్కారములు . 🙏🙏
🌺సకల లోక పాలనము గావించే నీ రచనలు, దివ్య లీలలు ,ఎవరు భావింతురో, వారికి అవియే ఇహమున పరమున ముక్తి సోపానాలైన మంత్రములు.🙏🙏
🌺ఓ గోవిందా నీకు అనేక నమస్కారములు.🙏🙏
🌺ఓ గోపాలా నీకు నమస్కారములు.🙏🙏
( గోకులంలొ గోవులకూ, ప్రజలకూ మనోహరుడవూ , పాలకుడవూ నీవు )
🌺మన్మధునకు గురువూ , తండ్రి అయిన నీకు అనేక నమస్కారములు .🙏🙏
🌺ప్రణవమునే ఆత్మగా ఉండే నీకు అనేక నమస్కారములు .🙏🙏
🌺దేవతలందరికీ దేవుడవయిన నీకు అనేక నమస్కారములు.🙏🙏
🌺అన్ని దివ్యమైన గుణములతో శోభించే నీకు నమస్కారములు. 🙏🙏
🌺ఈ క్రమమునే నిన్ను ఎవరు తలుస్తారో ,
వారికి నీ నామములే తారక మంత్రములై , భవ బంధములనుండి ముక్తిని ప్రసాదించును .🙏🙏
🌺ఓ దామోదరా నీకు నమస్కారములు .🙏🙏
( ఉదరమున గట్టిగా తాడు కట్టించుకుని బంధించుకుని లీలగా , నలకువరుని,మణిగ్రీవుని విముక్తులను చేసావు ..ఆహా ఏమి నీ లీల ).
🌺భూదేవి పతియైన నీకు నమస్కారములు.🙏🙏
🌺ఈ భూతలము మీది జీవులందరికీ నీవే నాధుడవు.🙏🙏
🌺శ్రీ మహా లక్ష్మికి పతియైన నీకు నమస్కారములు .🙏🙏
( కోరిన సిరి సంపదలను, భోగ భాగ్యములను, శ్రీ సతి చేత ఇప్పించువాడవు నీవే కదా.)
🌺సాధుపుంగవులను , భాగవతులను రక్షించు వాడా నీకు నమస్కారములు .🙏🙏
🌺ఓ వామన మూర్తి నీకు నమస్కారములు .🙏🙏
🌺అఖిలాండ లోకములు నీ సొంతము అయిన వాడా , నీకు నమస్కారములు.🙏🙏
🌺తామరపువ్వు రేకుల వంటి సుందర నయనములు కలవాడా నీకు నమస్కారములు .🙏🙏
(నీ చల్లని కృపా కటాక్ష వీక్షణములే మాకు రక్ష.)
🌺ఈ విధముగా నీ గొప్పతనమునెరిగి ఎవరు భజింతురో , వారు ధన్యతనొందురు. నీ భజనయే ఇహపరాలకు తారక మంత్రము.🙏🙏
🌺పరిపూర్ణ స్వరూపడవైన నారాయణా నీకు నమస్కారములు.🙏🙏
🌺ఓంకార స్వరూపుడవైన ఆది దేవా నీకు నమస్కారములు .🙏🙏
🌺నీ ఉనికికి ఆది అంతము లేదుకదా, ఓ శ్రీ వేంకటేశా , నీకు నమస్కారములు.🙏🙏
🌺ఆది శేషుని పై పవళించిన ఆ శ్రీ మన్నారాయణుడవే నీవు .నీకు అనేక నమస్కారములు.🙏🙏
🌺నరకాసుర సంహారము చేసిన శ్రీ కృష్ణ నీకు నమస్కారములు.🙏🙏
🌺 మమ్ములను నరకము బారిన పడకుండా మా పాపకర్మలను ధ్వంసము చేయు వాడవు నీవే . నీకు మా నమస్కారములు .🙏🙏
🌺ఓ నృసింహ రూపా నీకు నమస్కారములు.🙏🙏
🌺ఈ విధముగా నువ్వు నానా రూపములలో ఉండి శరణాగత రక్షకుడవని ఎవరు భావించి , భజన చేయుదురో , అట్టి వారికి , అన్నీ నీవై ముక్తి నొసగెదవు ఓ శ్రీ వేంకటేశ్వరా.
నీకు అనేక నమస్కారములు.🙏🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 58 )
✍️ -- మీ వేణుగోపాల్
🌹🌹 *సంకీర్తన*🌹🌹
నారాయణాయ నమో నమో
నానాత్మనే నమో నమో |
యీరచనలనే యెవ్వరు దలచిన
యిహపర మంత్రము లిందరికి ||
గోవిందాయ నమో నమో
గోపాలాయ నమో నమో |
భావజగురవే నమో నమో
ప్రణవాత్మనే నమో నమో |
దేవేశాయ నమో నమో
దివ్యగుణాయ నమో |
యీవరుసలనే యెవ్వరు దలచిన
యిహపర మంత్రము లిందరికి ||
దామోదరాయ నమో నమో
ధరణీశాయ నమో నమో |
శ్రీమహిళాపతయే నమో నమో
శిష్టరక్షిణే నమో నమో |
వామనాయ తే నమో నమో
వనజాక్షాయ నమో నమో |
యీమేరలనే యెవ్వరు దలచిన
యిహపర మంత్రము లిందరికి ||
పరిపూర్ణాయ నమో నమో
ప్రణవాగ్రాయ నమో నమో |
చిరంతన శ్రీ వేంకటనాయక
శేషశాయినే నమో నమో |
నరకధ్వంసే నమో నమో
నరసింహాయ నమో నమో |
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన
యిహపర మంత్రము లిందరికి ||
Негізгі бет narayanaya namo namo nanatmane namo namo
Пікірлер: 21