Nee Sannidhi Cheritimi || నీ సన్నిధి చేరితిమి
పల్లవి: నీ సన్నిధి చేరితిమి - ప్రభువా ప్రార్థన వినుమా
సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి
1. భారములతో వచ్చితిమి ప్రభువా - దృఢనమ్మికతో వచ్చితిమయ్యా
హృదయాలోచన లెరిగినవాడా మా మనవిని వినుమా
|| నీ సన్నిధి ||
2. ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమి
అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా
|| నీ సన్నిధి ||
3. మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమా
శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా
|| నీ సన్నిధి ||
4. కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువా
నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా
|| నీ సన్నిధి ||
Негізгі бет Nee Sannidhi Cheritimi || నీ సన్నిధి చేరితిమి
Пікірлер