నిను వీడిన మేనుండ లేదు
తను వీడిన నేనుండబోదు
కని చూడుము రెండు ఒకటేనని
కని చూడగా జంట మిథ్యేనని
కన ఏ ద్వంద్వమైనా ఇలానే
(నిను వీడిన మేనుండలేదు)
చరణం 1
ఏ వేదములు పరికించినా నీవె బ్రహ్మంబు అని అంటివి
ఏ వాదమున తర్కించినా నీవు సత్యంబు గాకుంటివి
నీవే లే నెరుకవై ఎన్ని కల ఆటలో
లేవె నిన్నెరిగినా వంథ్య సూనంబులే
(నిన్ను వీడిన మేనుండలేదు)
చరణం 2
నీ కల మేల్క స్థితి నొందగా కనరాకుంది కలముచ్చటా
ఒక క్షణమందె గురు సైగతో ఏమీ లేకుంది చూడెచ్చట
ఇక ప్రతి బంధనం దగ్ధపట శోభితం
ఒక హరి దర్శనం కరికి ముక్తాఫలం
(నిన్ను వీడిన మేనుండలేదు)
చరణం 3
ఈ శివరామ సిద్ధాంతము జన్మ మరణాల భ్రమరహితమూ శశిధర హరి యు అజులైనను గురు దరిలేక కనలేరుగా
అసి ససి ఖండనం అభయ శ్రీ రాజితం
నిశియు పోతట్టుటే శిష్యపరిపాలనం
రచన: అభయానంద చిట్టేటి కోదండరామయ్య
Негізгі бет #నిను
Пікірлер: 16