🙏🌹 గజేంద్ర మోక్షం 🌹🙏
8-116-శా.
పూరించెన్ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యమున్,
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్,
సారోదార సితప్రభా చకిత పర్జన్యాది రాజన్యమున్,
దూరీభూత విపన్నదైన్యమును, నిర్ధూతద్విషత్సైన్యమున్.
8-117-మ.
మొరసెన్ నిర్జరదుందుభుల్; జలరుహామోదంబులై వాయువుల్
దిరిగెం; బువ్వులవానజల్లుఁ గురిసెన్; దేవాంగనాలాస్యముల్
పరఁగెన్; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె; సా
గర ముప్పొంగెఁ దరంగ చుంబిత నభోగంగా ముఖాంభోజమై.
8-118-క.
నిడుద యగు కేల గజమును
మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్
దుడుచుచు మెల్లన పుడుకుచు
నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!
8-119-క.
శ్రీహరి కర సంస్పర్శను
దేహము దాహంబు మాని ధృతిఁ గరిణీ సం
దోహంబుఁ దాను గజపతి
మోహన ఘీంకార శబ్దములతోనొప్పెన్.
8-120-క.
కరమున మెల్లన నివురుచుఁ
గరమనురాగమున మెఱసి కలయంబడుచుం
గరి హరికతమున బ్రతికినఁ
గరపీడన మాచరించెఁ గరిణుల మరలన్.
Негізгі бет పోతన "శ్రీమద్భాగవతం" : గజేంద్ర మోక్షం - 22 (పూరించెన్ హరి పాంచజన్యము)
Пікірлер: 2