SRI KRISHNA ASHTAMI 2024 SPECIAL SERIES EPISODE - 04
SPECIAL THANKS TO VID YOGA KEERTANA GARU FOR SINGING MY POEM AND THIS RARE ANNAMACHARYA SANKEERTANA MELLIFLUOUSLY WITHOUT ANY SUPPORTING MUSICAL INSTRUMENTS .
THANKS TO THE COMPOSER SMT VETURI CHANDRA KALA GARU NICELY TUNED IN BOWLI RAGAM
🌺🍃 ------------🍃🌺
అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 495
( పరమ పురుషుడీ బాలుడట ..)
🌺🍃 ----------- 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 495 కి శుభ స్వాగతం ..🙏
ప్రార్థన ః--🌹🙏
విశదముగ నరయరమ్మా !
శిశువై యిటనున్నవాడు శ్రీహరె గాదా?
పశువులను మేపు వాడై ,
సశరీరముగ నరుదెంచె సర్వేశ్వరుడే !
🌹🙏🌹
✍️ --స్వీయపద్యము ( కందము )
🌹🌹
స్పష్టమైన రీతిలో లోతుగా విచారించుకుని చూడండమ్మా !
బిడ్డడై ఇక్కడ ఉన్నవాడు సాక్షాత్తు ఆ శ్రీహరియే కాదా ?🙏
తనకు తానుగా ఒక శరీరము దాల్చి , ఏదో పశువులను కాచుచున్నట్లుగా వచ్చి , మనలనందరినీ రక్షించుచున్న ఈ బిడ్డడు , ఈ చిన్ని కృష్ణుడు నిజానికి ఆ సర్వేశ్వరుడే ! 🙏
వానికి సదా మంగళములు పాడెదము రండి !🙏
🌺🍃 -----------🍃🌺
మున్నుడి ః-- 🌹👇
అన్నమాచార్యుల వారు చిన్నారి గోపాలబాలుడిని ఆ గోకులములో ఉన్న ముద్దుల బాలుడిని , మనసునిండా నింపుకొని చూచి తరించి, అతడే వైకుంఠనారాయణుడని ,అతడే ఈ శ్రీ వేంకటేశ్వరుడని , విశ్వసించి పాడుచున్నారు .🙏
మరి చక్కని ఆ సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
🌺🍃 ----------- 🍃🌺
🌹🌹
ఈ చిన్నారి బాలుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే యట ఓ సఖులారా ! 🙏
అదిగో చూడండి హర బ్రహ్మాదులందరూ ఆ వాకిలి వద్దనే నిలబడి నమస్కరించుకుంటున్నారు !
ఈ గోపాలబాలుడు నారాయణుడే ! 🙏
🌹🌹
ఇతడే పరమాత్ముడు ! ఇతడే దేవుడు !
అంతే కాదు దేవతలకందరికీ కూడా దేవుడు ఇతడే !
వేవేల విధములుగా , వేదములన్నీ మర్యాదగా పొగడుచున్నవి ఇతని గుణగణాలనే ! 🙏
అంతటి వాడైనప్పటికీ , ఈ భువిపైకి వచ్చి , ఆ దేవీకీ దేవి ,వసుదేవులకు కొడుకుగా ఆవిర్భవించినాడు .🙏
ఆహా!! ఆ దంపతుల ఎంతటి గొప్ప నోమును, ఎంతగొప్పనైన రీతిలో నోచుకుని ఉన్నారో కదా ఇంతటి భాగ్యమును పొందుటకు !🙏
🌹🌹
ఇతడు అంతటా ఉన్న సర్వాంతర్యామి !
విచారించి చూచితే ఇతడు ఎవరికీ లోబడని సర్వ స్వతంత్రుడు !🙏
ఆదిమూలమైన శ్రీమన్నారాయణుడు . అసలు ఇతనికి తుది మొదలు అన్నది కూడా లేదు .🙏
అంతటి వాడైనప్పటికీ యశోదకూ నందగోపునకు మరియొక సారి మారుగా కొడుకై వారి చెంతనే ఉన్నాడు , తరువాతి క్రమముగా ! 🙏
ఆహా ! ఈ యశోదా నందగోపులు ఇంతకు పూర్వము ఎంతటి గొప్ప పుణ్యములను చేసి యున్నారో కదా ! 🙏
🌹🌹
ఇతడే శ్రీ మహాలక్ష్మీ పతి !
ఇహమున సంపదలకన్నిటికీ , ఆవల కైవల్యమనే సంపదకూ పతియైన వాడు కూడా ఇతడే !🙏
తన ఉనికిని ఈ వేంకటాద్రిపై చూపి అందరికీ పతిగా నిలచి ,అందరినీ రక్షింప పూనుకుని ఉన్నాడు శ్రీవేంకటేశ్వరుడై!🙏
గోకులములోని గోపకాంతలకందరికీ , తమతమ భర్తల సోదరుని సాటిగా , తాను కలిసిమెలిసి ఉన్నాడు వారితో .🙏
ఆహా ! వారాందరూ వారికి వారే సాటి ! ఈతని పొందును అందుకున్నారు !🙏
వారికీ ఈ కృష్ణునికీ ఏనాటి దైవిక సంబంధమున్నదో , వారు అంతటి అదృష్టవంతులైరి ! 🙏
🌹🙏🌹
ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 495)
✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
🌹🌹 సంకీర్తన 🌹🌹
॥పల్లవి॥
పరమ పురుషుఁడీ బాలుఁడట
హర విరుంచులు మొక్కేరదివో వాకిటను
॥చ1॥
దేవుఁడితఁడు సర్వదేవతల కొడయఁడు
వేవేలు వేదములచే వేద్యుఁడితఁడు
దేవకీదేవికి వసుదేవునికిఁ గొడుకాయ
యీవిధము నోఁచిరి వీరెంత భాగ్యవంతులో
॥చ2॥
అంతటాఁ దానున్నవాఁడు అరయ స్వతంత్రుఁడు
అంతయు నాదియులేని ఆదిమూరితి
వంతుకు యశోదకు నవ్వల నందగోపునికి
దొంతరకొడుకైనాఁడు తొల్లి వీరే పుణ్యులో
॥చ3॥
ఇందిరావల్లభుఁడు ఇహపరనాయకుఁడు
కందువ శ్రీవేంకటాద్రిఁ గాపున్నవాఁడు
మందగొల్లెతలకెల్ల మరఁది దానైనాఁడు
ఇందరు నిందరే వీరి కెన్నటి సంబంధమో
🌹🙏🌹🙏🌹
#PARAMAPURUSHUDU #పరమపురుషుడీ #YOGAKIRTANA #YOGAKEERTANA
#annamayyaaksharavedam #srikrishnasongs #krishnabhajan #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #annamayyakeerthanalu #annamayyakeerthana #కృష్ణాష్టమి #గోకులాష్టమి #krishanaahtami #gokulashtami
Негізгі бет PARAMA PURUSHUDU / పరమ పురుషుడీ /AAV SERIES 05 EP 495 / VETURI CHANDRAKALA / YOGA KIRTANA / BOWLI
Пікірлер: 6