ఆరాధనకు యోగ్యుడా - నా స్తుతి స్తోత్రార్హుడా
నా జీవాధిపతియైన యేసయ్యా
నీ కృప నాకు చాలును ప్రభువా //ఆరాధనకు//
శిధిలమైన శిలవలె ఉంటిని
శిల్పకారుడవై కనికరము చూపితివి
నీ ఉలి చేతపట్టితివి నాకై
నీ పని నాలో ప్రారంభించితివి. //ఆరాధనకు//
జీవనదివై ప్రవహించితివి
ఎందరి బ్రతుకులనో చిగురింపజేసితివి
తిరిగి జన్మింప చేసితివి నీలో
ఇకను జీవించువాడను నే కానుగా //ఆరాధనకు//
నా జీవితమొక నాటకరంగముగా
చీకటి తెరవెనుక కనుమరుగైపోగా
నాకు వినిపించె జీవన రాగాలు
బ్రతుకుపై ఆశ కలిగించె నీమాటలు //ఆరాధనకు//
PASTOR. ANAND JAYAKUMAR garu
HOSANNA MINISTRIES
CHINTAREDDY PALEM Road
NELLORE
Негізгі бет Pastor. ANAND JAYAKUMAR garu // Aradhanaku Yogyuda // HOSANNA MINISTRIES NELLORE
Пікірлер: 18