మనందరమూ కూడా మన మన తప్పుల నుంచి తప్పించు కోలేమూ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలుస్తుంది . అందుకే భగవంతుడు మనిషిని 'కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవడానికి . తస్మాత్ జాగ్రత్త . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు కదా మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . మన గురించి మన కంటే కూడా ఆ దైవానికి బాగా తెలుసు . కనుక దేవుడితో ------ ఆడ కూడదు . తస్మాత్ , తస్మాత్ జాగ్రత్త . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . ( మనిషి మనిషిని మోసం చేయగలడేమో కాని ఆ దైవాన్ని కాదు . )
Пікірлер: 1