Jai srimannaarayana 🙏🌹🙏 om Asmath gurubyo namah 🙏🌹💐🙏
@nagamaniparitala
3 ай бұрын
Jai Srimanarayana 🙏🙏🙏
@prasadboggarapu6726
3 ай бұрын
16-06-2024. 92వ రోజు.... 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!*🏵️ నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - యయాతి పూరుడికి మంచిమాటలు చెప్పటం. ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ, పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసమహర్షులవారికీ, పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ..... పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు "ఓ మహర్షులారా! ప్రతిభావంతుడైన వైశంపాయనమహర్షులవారు పార్థుడి ప్రపౌత్రుడైన జనమేజయమహారాజుకు ఉపదేశంచేస్తూ ఈ రకంగా అంటున్నాడు "ఓ రాజా! సకల పాపములను, దోషములను దగ్ధం చేయగలిగినటువంటిది యయాతి పుణ్యప్రదమైన చరిత్ర! అటువంటి యయాతి తన పుత్రుడైన పూరుడికి రాజ్యపట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమం స్వీకరించి కఠోర నియమాలను పాటిస్తూ కొంతకాలానికి దేవతావిమానంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు! ఆ స్వర్గలోకంలో దేవర్షులచేత పూజింపబడి బ్రహ్మలోకానికి వెళ్ళి, అక్కడ బ్రహ్మర్షులచేత పూజింపబడి అనేకకల్పాలుండి మళ్ళీ ఇంద్రలోకానికి వచ్చాడు! అక్కడ యయాతిని దేవేంద్రుడు పూజించి ఈ విధంగా అడుగుతున్నాడు "ఓ పుణ్యాత్మా! నీవు నీ పుత్రునికి పట్టాభిషేకం చేసి ఏమేమి మంచిమాటలు ఉపదేశించావో నాకు చెప్పవా!" అని అడగగానే యయాతి ఇలా అంటున్నాడు "ఓ దేవేంద్రా! నేను పూరుడికి " ఓ కుమారా! మానవుడికి దైన్యము, క్రోధము, కుటిలత్వము, వైరము వంటి దుర్గుణాలు ఎప్పుడూ ఉండకూడదు! బుద్ధి కుశలము కలిగినటువంటి మానవులు తల్లితండ్రులను, పండితులను, తపోధనులను, సహనమూర్తులను ఏనాడు కూడా అవమానించకూడదు! లోకంలో సహజంగానే చెడ్డవారు మంచివారిని ద్వేషిస్తారు! బలహీనులు బలవంతులను ద్వేషిస్తారు! కురూపి రూపవంతులను ద్వేషిస్తారు! ధనహీనులు ధనవంతులను ద్వేషిస్తారు! పనులఉ చేయని సోమరులు పనులు చేసే సమర్థులను ద్వేషిస్తారు! గుణహీనులు గుణవంతులను ద్వేషిస్తారు! ఓ కుమారా! కోపాన్ని అదుపులో ఉంచుకున్నవారు కోపాన్ని అదుపులో ఉంచలేనివారికంటే గొప్పవారు! ఇతరులు నిందిస్తున్నా తిరిగి వారిని నిందించకూడదు! నిగ్రహం ఉంటే ఆదే నిందించేవారిని దహించి వేస్తుంది! నిందించేవారి పుణ్యం కూడా నిందించనివారికి వచ్చేస్తుంది! ఇతరులను పరుషమైన మాటలతో బాధించకూడదు! ఇతరులు ఉద్వేగం పొందేటటువంటి మాటలు మాట్లాడకూడదు! ఇతరులను మాటలతో హింసించేవారిని 'దరిద్రులు' అంటారు! ఎందుకంటే వారినోటిలో రాక్షసి ఉందని అర్థం! ఓ కుమారా! మంచివారిని గౌరవిస్తూ ఉండాలి! వారిచే గౌరవింపబడాలి! వారిచే రక్షింపబడాలి! మంచివారిని అనుసరిస్తూ ఉండాలి! ఆందరిపట్ల దయ కలిగిఉండాలి! మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకుంటే అందరి ఆప్యాయతను పొందవచ్చు! ఇతరులను తనవారిగా చేసుకోవటానికి ఇంతకంటే మేలైన ఉపాయం ముల్లోకాలలో మరోకటి లేనే లేదు! ఓ కుమారా! అందుకే సంతతము శుభకరమైన మాటలే మాట్లాడాలి! కఠినంగా మాట్లాడకూడదు! గౌరవించదగినవారిని గౌరవిస్తేనే అది గౌరవించేవారికి గౌరవాన్ని ఇస్తుంది! శక్తికి తగినవిధంగా దానాదులు చేస్తుండాలి!" అని నా కుమారుడికి ఉపదేశం చేశాను!" ఆని యయాతి దేవేంద్రునికి తెలియచేయగానే దేవేంద్రుడు మళ్ళీ యయాతిని ఇలా అడుగుతున్నాడు "ఓ మహాత్మా! నీవు గృహస్థాశ్రమంలో ఉన్నావు! వానప్రస్థాన్ని స్వీకరించావు! కఠోరమైన తపస్సు చేశావు! ఇది అసాధారణ విషయం! మరి నీ తపఃప్రభావముతో నీవు ఎవరితో సమానమైనవాడవయ్యావో చెప్పవా?!" అని అడగగానే యయాతి ఇలా అంటున్నాడు "ఓ దేవేంద్రా! దేవతల, గంధర్వుల, దైత్యుల, యక్షుల, రాక్షసుల, మానవుల, చారణుల, సిద్ధుల, మునులలో శ్రేష్ఠమైనవారి తపస్సులు కూడా నా తీవ్రమైన తపస్సుకు సమానం కావు!" అని యయాతి గర్వంగా బదులు చెప్పగానే దేవేంద్రుడు "ఓ యయాతీ! నీవు వారి తపస్సుల ప్రభావాన్ని తెలుసుకోకుండానే అందరినీ తిరస్కరిస్తున్నావు! అందుకే నీవు ఆర్జించిన పుణ్యమంతా క్షీణించింది! ఈ పుణ్యలోకాలలో నీవు ఉండవలసిన సమయం పూర్తైపోయింది! నీవు ఇక్కడ ఉండటానికి వీలులేదు! మళ్ళీ నీవు అధోలోకాలకు వెళ్ళు!" అని దేవేంద్రుడు అనగానే యయాతి "ఓ దేవేంద్రా! దేవతలను, ఋషులను, గంధర్వులను అవమానించినందుకు నేను సంపాదించిన పుణ్యం క్షీణించింది! కనీసం ఇప్పుడైనా నన్ను మంచివారిమధ్య ఉండేవిధంగా చేయవా!" అని అంటూ యయాతి దేవేంద్రుని వేడుకుంటున్నాడు.........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🔆🙏🏼🔆🌄
@durgaprasadch9824
3 ай бұрын
Om Asmath gurubhunamha 🌹🙏
@saibabumadala9576
3 ай бұрын
Jai sri mannarayana Jai sri mannarayana Jai sri mannarayana Jai sri mannarayana Jai sri mannarayana Jai sri mannarayana Jai sri mannarayana
@sridhar8661
3 ай бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🏻 జై శ్రీరామ్ 🙏🏻 జై శ్రీ కృష్ణ 🙏🏻
@ramakrishnanalamasu4214
3 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@nandinivasist5967
3 ай бұрын
Jai Srimannarayana 🙏🙏🙏
@kollanagangadhararao1865
3 ай бұрын
Om Sri Gurubyo namaha
@susheelammanarayandas200
3 ай бұрын
Jai srimannarayana om namobhagavatevasudevayanamaha he Krishna rakshamami sarvam srikrishnarpanamastu 🙏🙏🙏🌿
@vasavambanatakala157
3 ай бұрын
ఓంశ్రీ సద్గురుభ్యో నమః జైశ్రీమన్నారాయణా కరిశ్యే వచనంతవ హరే రామ హరేరామరామరామహరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు గోవింద గోవిందా జైశ్రీరామ జైజై శ్రీరామ్ 🌹🌹🙏🙏
@prasadkota9131
3 ай бұрын
Jai sri Krishna 🙏
@nirmalaakkinepally4433
3 ай бұрын
ఓం అస్మత్ గురుభ్యో నమః🙏
@nagasrinivasarao4775
3 ай бұрын
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏 🙏 జై! శ్రీమన్నారాయణ🙏 జై శ్రీరామ్!...
@MandalaRaju
3 ай бұрын
జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మ నే నమః 🙏🙏🙏
@RamAkki
3 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@armyblinkypranavi6456
3 ай бұрын
JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA 🎉🎉🎉 JAI SRI GURUDEVA 🎉🎉 SRIMATHE RAMANUJAYA NAMAH 🎉🎉
@PNBSSrinivas
3 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం భగవతేవాసుదేవాయ 🙏 జై శ్రీమన్నారాయణ 🙏
Пікірлер: 42