క్రైస్తవుడు అనగానే కొడితే కొట్టించుకోవాలి, పొడిస్తే పొడిపించుకోవాలి అనే అవగాహన లేని బోధ చలామణి ఔతున్న ఈ రోజుల్లో వాక్యానుసారంగా బైబిల్ ఎలాంటి ప్రతిదాడిని నిషేధిస్తుందో ఎలాంటి ప్రతిదాడిని అనుమతిస్తుందో వివరించినందుకు ధన్యవాదాలు. బైబిల్ పగతీర్చుకోవద్దని చెబుతుంది తప్ప ప్రాణాలను కాపాడుకోవద్దని చెప్పడం లేదు. మీ ఆదికాండము 14 వ్యాఖ్యానంలోనూ నిర్గమకాండము 22:2 వ్యాఖ్యానంలోనూ నిర్గమకాండము 20 లో నరహత్య చెయ్యకూడదు అనే ఆజ్ఞకు రాసిన వ్యాఖ్యానంలోనూ అది చదివాను. యేసుక్రీస్తు నిన్ను కుడిచెంపపై కొడితే ఎడమ చెంప చూపించు అనేమాటల సందర్భం ఏంటో కూడా నిర్గమకాండము 21 వ్యాఖ్యానంలో చదివాను. థాంక్యూ.
Пікірлер: 4