రేపటి నుండి అంటే జులై 6 శనివారం నుండి జులై 14 ఆదివారం వరకు శ్రీవారాహి నవరాత్రులు నిర్వహించుకునేందుకు అమ్మవారి భక్తులు సిద్దమైనారు. ఆషాఢ గుప్త నవరాత్రులుగా పిలుచుకునే తొమ్మీది రోజులు విశేష పూజలు నిర్వహిస్తారు. 6వ తేదీన ఇంద్రాణి దేవికి ఉన్మత్త వారాహి పూజలు చేస్తారు. 7వ తేదీన బ్రహ్మి దేవికి, 8వ తేదీన వైష్ణవి దేవికి స్వప్నవారాహీ పూజ, 9వ తేదీన మహేశ్వరి అమ్మవారికి కిరాతవారాహి పూజ, 10వ తేదీన వారహి అమ్మవారికి శ్వేత వారాహి పూజ, 11వ తేదీన మహేశ్వరీ అమ్మవారికి ధూమ్రవారాహి పూజ, 12వ తేదీన చాముండి అమ్మవారికి మహావారాహి పూజ, 13వ తేదీన మహాగౌరి, మహా లక్ష్మి, అష్ట మాతృకగా లక్ష్మి దేవి ఆమ్మవార్లకు వార్తాలి వారాహి పూజ, 14వ తేది లలితా అమ్మవారికి దండిని వారాహి పూజ, చివరి రోజైన 15వ తేదీన ఆది వారాహి మహపూజ, ఉద్యాపనతో శ్రీవారాహి నవరాత్రులు వ్రతాలు పూర్తవుతాయని భక్తులు తెలిపారు.#vasavi #vasavigroup #vasavisisters
- Күн бұрын
శ్రీవారాహి నవరాత్రులు
- Рет қаралды 372
Пікірлер