Welcome to bulliakka kitchen
sorry అండి, నేను మీకు పచ్చి చింతకాయ paste చేసిన video description లో పెడతాను అని చెప్పాను, అయితే ఆ video నేను చేయలేదు చేశాను అనుకొని చెప్పాను. పచ్చి చింతకాయ పచ్చడి చేసిన video మాత్రమే వుంది. ఆ link పెడుతున్నాను, అది కూడా వాడుకోవచ్చు ఇలా పుల్లకూరలకి. ఐతే పచ్చి చింతకాయ paste ఎలా చేసుకోవాలో ఇపుడు వ్రాస్తున్నాను.
ముందుగా మంచి కండ గల పచ్చి చింతకాయలును కడిగి, cooker లో గాని, బయట కాని ఆవిరి మీద ఉడకపెట్టాలి.cooker అయితే ఒకే ఒక విజిల్ చాలు. ఆ తర్వాత చింతకాయ పొట్టు వొలిచేయాలి, easy గానే వచ్చేస్తుంది, ఆ తర్వాత చిల్లులు గిన్నెలో ఈ చింతకాయని వేసి రుద్దుతూ వుంటే గింజలు separate అవుతాయి, గుజ్జు మాత్రం చక్కగా ఆ చిల్లులో నుండి బయటికి వస్తుంది. అంతే నండి. అలా వచ్చిన పచ్చి చింతకాయ గుజ్జు నిల్వ ఉండటానికి సరిపడా ఉప్పు కలిపి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ వుంటుంది. fridze లో పెట్టుకుంటే ఎప్పటికీ fresh గానే వుంటుంది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి
పచ్చి చింతకాయలును ఎండపెట్టి, పైన పొట్టు తీసి, ఆ చింతకాయలును అలాగే ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు కొంతమంది, అవసరం అయినపుడు మన చింతపండు మాదిరే direct గా కూరల్లో వేసి వాడుకుంటారు, ఏది ఏమైనా మొదటి పద్ధతి ప్రకారం చేసుకోవటం బాగుటుంది అండి.
పచ్చి చింతకాయ పచ్చడి link ఇది
• పచ్చి చింతకాయ మన చిన్న...
To watch more interesting videos subscribe us on
/ @bulliakka5757
like / share / subscribe
click on bell icon for more updates
"అందరూ బాగుండాలి, అందులో నేను, నా కుటుంబం వుండాలి ".
Негізгі бет రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వంకాయ పుల్లకూర. ఇది అన్నిటికీ మంచి కాంబినేషన్ కూడాను.
Пікірлер: 1