#Raithu Song2021#Burra Sathish
Lyrics & Singer : Burra Sathish
9908906724
Music : Bharath mekala
Camera : Santhosh Star Creations
Editing - DI : Bhaskar Akena
Mixing : Pasha Studios (Huzurabad )
Special thanks : Regunta Chandra Shekar
ఎద్దు యవుసం ఓడిపోతున్నదా
ఆ పొద్దు గాడి తప్పి పోతున్నదా
తాళి పుస్తెలను అమ్ముకోని
మట్టితల్లినే నమ్ముకోని
బువ్వ పెట్టినోడు అన్న దాత...2
సావు తొవ్వ జూడవట్టే ఎందుచేత..
తట్టుకోలేని ఈ ఘోరము
ఏమి జేసిండు రైతన్న నేరము
ఎటుపోతుంది ఈ దేశము
ఎవడు జేస్తుండు రైతును మోసము...
1) చెమట చుక్కల తోని చెలిమి జేసెటోడు
బురద కాళ్ళ భూమి పుత్రుడురా
ఆకలి కడుపులో అన్నమైతడు
దేశ జీవనంలో ముఖ్య పాత్రుడురా
పెట్టుబడికి జేసుకున్న అప్పు....2
రైతు మెడ మీద కత్తయ్యి ఉంది ముప్పు..
" తట్టుకోలేని"
2) పండించిన తన పంటకు ధరను
నిర్ణయించుకునే హక్కు లేదు
నకిలీ విత్తనాలు నట్టేట ముంచితే
ఆదుకునే ఏ దిక్కు లేదు
కొనలేని మార్కెట్టు మాయజాలం...2
ఆత్మహత్య జేసుకుంది ఆరుగాలం
" తట్టుకోలేని"
3) కంటి పాపవోలే పంట కాపు గాసి
పెంచుకుంటడు గంపెడంత ఆశ
ప్రకృతి కన్నెర్ర జేసినప్పుడు జూడు
పగిలిపోయే గుండే రామగోస
నాగలి ఎడ్లకు నాయకుడు...2
అన్నదాత అంటేనే అమాయకుడు
"తట్టుకోలేని"
4) రైతే రాజు అంటూ పొగుడుతుంటారయ్య
పేరుకే ఉన్నాది వ్యవసాయము
రాజధాని ముందు రాలిపోతున్నా
రైతు కు అందది ఏ సాయము
కన్నీరు పెడుతుంది గొడ్డు గోద...2
కల్లమై పాడుకుంటున్న రైతు గాథ
"తట్టుకోలేని"
Негізгі бет Музыка Raithu Song 2021 || Burra Sathish || Bharath Mekala || Latest Raithu Song ||
Пікірлер: 334