పల్లవి: - సర్వాధికారియైన నా యేసయ్య
నీ కృపాయే నాకు ఆధారమయ్యా
మారని నీ ప్రేమ విడువని నీ కృప
నన్ను నడుపునయ్యా నీ త్రోవలో
అ" పల్లవి: - నీ కృపయే నా జీవము - నీ కృపయే నా సర్వము -
నీ కృపయే నా భాగ్యము నా యేసయ్య !
1. నన్ను రక్షించలేని మార్గములేన్నో వున్న
నీ కృపయే నాకు జీవమార్గమాయనే
ప్రథమ ఫలముగా ప్రతిష్ఠిత జనముగా
నన్ను మార్చినది నీ కృపయే " నీ కృపయే నా జీవము"
2. వెలకట్టలేని విలువైన రక్తమును
నా కొరకు నీవు చిందించినావయ్యా
విలువలేని నా కొరకై బహుగా ప్రయాసపడిన
నీ కృపను నేను వివరించలేనయ్యా " నీ కృపయే నా జీవము"
3. ఆత్మీయ యాత్రలోన నా తోడై వుండి
కృప వెంబడి నీ కృపతో నన్ను నడుపుచున్నావే
ఈ యాత్ర కడవరకు నీ కృపలో ముగించి
నిన్ను చేరుటయే నా వాంఛ ఇదియే " నీ కృపయే నా జీవము"
Негізгі бет Sarvadikaari-సర్వాధికారి || 2023 New Year Song || George Bush || Daniel || Benjamin || Sandy
Пікірлер: 84