సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ రావమ్మా
వరములిచ్చే వరలక్ష్మి రావమ్మా
ఘల్లుఘల్లున నీ కాలిమువ్వల సవ్వడితో మా నట్టింట తిరుగవమ్మా
కలిమిని బలిమిని ఇచ్చే తల్లివి నీవమ్మా ||
కలువల పూజలతో మనసార కొలిచేము
కనకరాశులు కురిపించే భాగ్యలక్ష్మివి నీవమ్మా||
కుంకుమ పూజలతో నిన్నే కొలిచేము
సౌభాగ్య మిచ్చే సౌభాగ్యలక్ష్మివి నీవమ్మా ||
నిన్నే నమ్ముతు కొలిచే వారికి లోటే లేదంటా
ఆపదలో ఆదుకునే అష్టలక్ష్మివి నీవమ్మా ||
సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ రావమ్మా
వరములిచ్చే వరలక్ష్మి రావమ్మా|||
✍️ రచన
@ హంసగీతి
Негізгі бет సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ రావమ్మా వరములిచ్చే వరలక్ష్మి రావమ్మా..
Пікірлер: 37