విభజన గాయాలనుంచి తేరుకోవాలంటే అభివృద్ధి పరుగులు పెట్టాలి. అభివృద్ది జోరుగా సాగాలి అటే పరిశ్రమలు వెల్లువలా తరలిరావాలి. అలా రావాలంటే... ఇక్కడ మౌలిక సౌకర్యాల కల్పన అద్భుతంగా సాగాలి. అలాగని కేవలం మౌలిక వసతులు కల్పించి ఊరుకుంటే లాభం లేదు . పెట్టుబడులు పెట్టాలనుకున్న సంస్థలకు అన్నివేళలా అందుబాటులో ఉండాలి అనుమతులు సకాలంలో లభించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఈ కోణంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలిస్తున్నట్టే చెప్పాలి. ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలన్న లక్ష్యంతో అందుకు తగ్గట్టుగానే పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రధమ స్థానంలో నిలిస్తే దేశంలో పరిశ్రమల స్థాపనకు తొలి ప్రాధాన్యంగా మారింది శ్రీసిటీ. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు శ్రీసిటీ కేంద్రంగా మారుతోంది. ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచస్థాయి తయారీ రంగానికి శ్రీసిటీ సెజ్ గమ్యస్థానంగా కనిపిస్తోంది. ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రారంభమైన శ్రీసిటీ ఇప్పుడు సమీకృత అభివృద్ధి నగరంగా మారుతోంది. అతి త్వరలో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి శ్రీసిటీ చుక్కానిలా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: goo.gl/aub2D9
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel - bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Circle us : goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------
Негізгі бет Sri City | To become A Steering | for Industrial Development in AP | Idi Sangathi
Пікірлер: 69