This is a special song by noted singer Smt.Bhudevi made on the Occasion of Telugu Bhasha Dinotsavam.
The song was written by Mr. Dr.Deergasi Vijay Bhaskar, Music by Mr. UV Niranjan
Editing by Mr.Vinod, Camera by Mr. Riyaz and Designed by Mr. Sanjay Kishore
రచన: డా.. దీర్ఘాశి విజయ్ భాస్కర్ గారు
సంగీతం : యు. వి. నిరంజన్
గానం: ‘తెలుగు కోకిల’ భూదేవి
రూపకల్పన: సంజయ్ కిషోర్
Tene Palukula Song lyrics:
ప: తేనెపలుకుల తెలుగు తెల్లబోయి చూస్తోంది
కడుకమ్మనైన తెలుగు కంట నీరు పెడుతోంది
మీసమున్న మగవాడికి మాతృభాష రోషమురా
చీరకట్టు మహిళలకు తల్లి భాష తళుకేనురా
తల్లి పాలు తాగకుంటే తనయుడికి సత్తువేది
అమ్మ భాష వదిలేస్తే అంతకన్న పాపమేది II తే II
చ1: అఆలు పలుకుతుంటే ఆకాశం ఒంగుతుంది
అమ్మా ఆవు అంటుంటే అవని గుండె పొంగుతుంది
నోట మాట పలకనిదే ఏ భాషా బతకదురా
ఆదరణే లేనిదే అజంతమైన అంతమురా II తే II
చ2:మాతృభాష మనిషికెపుడు గుర్తింపురా
ఆ భాషలోనే పసి మనుసులు వికసించురా
మాతృభాషలోనే చదివి మేధావులయ్యారు
తెలుగులోనే చదివి మరి దేశాన్ని ఏలారు II తే II
చ3: కూటి కొరకు ఖండాలను తిరిగిరా...
కీర్తి కొరకు సముద్రాలు చుట్టియ్యారా!
నేర్చుకో ఎక్కడ ఏ భాషకు వొస్తుందో కొలువు
దెబ్బ తగిలి గాయమైతే అమ్మా అని పిలువు II తే II
#Telugu #Bhasha #Dinotsavam
Негізгі бет Музыка 'తేనే పలుకుల తెలుగు' Tene Palukula Song || Telugu Bhasha Dinotsavam 2023 || Singer Bhudevi
Пікірлер: 21