ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆవకాయ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించినది, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వివిధ భారతీయ ఊరగాయలులో ఇది ఒకటి. ఆవకాయ కోసం కొట్టిన మామిడికాయల ముక్కలు. కాస్త పెద్ద అవకాయ అనుకోవచ్చును.ఆవకాయ ప్రధాన పదార్ధాలు మామిడికాయలు, ఆవాలు (ఆవాలు పొడి), పచ్చడి కోసం ఉపయోగించే ఇతర సుగంధ ద్రవ్యాల కలయికతో ఏర్పడుతుంది.కారంతో కూడిన ఊరగాయలకు దక్షిణ భారతీయులకు లోతైన అనుబంధం ఉంటుంది.
అనేక రకముల ఊరగాయలు దక్షిణ భారత దేశము ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. పుల్ల పచ్చి మామిడి ముక్కలతో చేసే ఆవకాయ, మాగాయ, లేక దాని కోరుతో చేసే మామిడికోరు ఊరగాయ; నిమ్మ, దబ్బ, ఉసిరి, గోంగూర, చింతకాయ, పండుమిరప, ఉల్లి, వెల్లుల్లి ఊరగాయలు తరతరాల నుంచీ తెలుగువాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య టమోటా, దోస, క్యారట్టు, కాలిఫ్లవరు ఊరగాయల్లాంటివి కూడా వాడడం మొదలుపెట్టారు.
కావాల్సిన పదార్థాలు
మామిడికాయలు , కారం , ఆవపిండి ., ఉప్పు, పసుపు, మెంతులు, నువ్వుల నూనె (మంచిది/శ్రేష్టం) లేదా వేరుశనగ నూనె.
Негізгі бет | Tasty and Spicy Avakaya Pachadi 2024|
No video
Пікірлер: 11